DC vs RCB : మెరిసిన కార్తీక్ ఢిల్లీ టార్గెట్ 190

రాణించిన మ్యాక్స్ వెల్..షాబాజ్ అహ్మ‌ద్

DC vs RCB : ఐపీఎల్ 2022లో భాగంగా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 189 ర‌న్స్ చేసింది. స్టార్ ప్లేయ‌ర్ దినేశ్ కార్తీక్ కేవ‌లం 34 బంతులు ఆడి 66 ప‌రుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు 5 సిక్స‌ర్లు ఉన్నాయి.

వ‌చ్చీ రావ‌డంతోనే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక షాబాజ్ అహ్మ‌ద్ 32 ప‌రుగులు చేసి కీల‌క పాత్ర పోషించాడు. అంత‌కు ముందు గ్లెన్ మ్యాక్స్ వెల్ సూప‌ర్ ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు.

ఢిల్లీ క్యాపిట్స్ బౌల‌ర్ల‌లో శార్దూల్ ఠాకూర్ , ఖ‌లీల్ అహ్మ‌ద్ , అక్ష‌ర్ ప‌టేల్ , కుల్దీప్ యాద‌వ్ చెరో ఒక వికెట్ చొప్పున తీశారు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ (DC vs RCB)స్కిప్ప‌ర్ రిష‌బ్ పంత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ప్రారంభంలోనే ఆర్సీబీ 92 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ స‌మ‌యంలో కార్తీక్, గ్లెన్ , షాబాజ్ ఆదుకున్నారు. ప్ర‌ధానంగా దినేష్ వ‌చ్చీ రావ‌డంతోనే అటాక్ స్టార్ట్ చేశాడు.

ఇక వ‌ర‌ల్డ్ స్టార్ ప్లేయ‌ర్ గా పేరొందిన విరాట్ కోహ్లీ ఇవాల్టి మ్యాచ్ లో నిరాశ ప‌రిచాడు. లేని పరుగు కోసం వెళ్లి ర‌నౌట్ గా వెను దిరిగాడు. కేవ‌లం 12 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.

లలిత్ యాద‌వ్ విసిరిన అద్భుత‌మైన బంతి వికెట్ల‌ను తాకింది. ఇక ఆర్సీబీ(DC vs RCB) కెప్టెన్ డుప్లిసిస్ ఆడుతాడ‌ని అనుకుంటే 8 ర‌న్స్ కే వెనుదిరిగాడు. ఆట ప్రారంభంలోనే ఓపెన‌ర్ అనూజ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఇక ఢిల్లీ నాలుగు మ్యాచ్ ల‌లో రెండు గెలిచింది. ఇక ఆర్సీబీ 5 మ్యాచ్ లు ఆడి మూడు మ్యాచ్ ల‌లో గెలుపొందింది.

Also Read : ఐపీఎల్ టైటిల్ రేసులో ఆర్సీబీ

Leave A Reply

Your Email Id will not be published!