Rakesh Tikait : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన యూపీ లఖింపూర్ ఖేరి కేసులో కీలక నిందితుడిగా ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా కు మంజూరు చేసిన బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
జస్టిస్ నూతలపాటి వెంకట రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈనెల 4న తీర్పును రిజర్వు చేసింది. ఈనెల 18న సంచలన తీర్పు చెప్పింది.
ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ ప్రభుత్వానికి, కేంద్రంలోని మోదీ సర్కార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది ధర్మాసనం. ఈ సందర్భంగా బాధితులకు తమ వినిపించే హక్కు లేకుండా చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈ తీర్పు బాధితులకు, పేదలకు, బడుగులకు ఒక భరోసా ఇచ్చిందని పలువురు రైతు నాయకులు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు పేర్కొంటున్నారు.
తాజాగా ఈ తీర్పుపై స్పందించారు భారతీయు కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి, సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నేత రాకేశ్ తికాయత్(Rakesh Tikait ). భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు ను స్వాగతించారు.
రైతులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఏర్పడిందని తెలిపారు. ఇక జరగాల్సి ఉంది రైతులకు పూర్తి భద్రత, పరిహారం, న్యాయం అందించే అని పేర్కొన్నారు రాకేశ్ తికాయత్.
అమాయక రైతులను జైలు నుంచి విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పూర్తి న్యాయం జరిగేంత దాకా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మోదీ సర్కార్ పై మరోసారి నిప్పులు చెరిగారు రైతు నేత.
Also Read : ఆశిష్ మిశ్రాకు షాక్ బెయిల్ రద్దు