Prithvi Shaw : ఐపీఎల్ 2022లో ఈసారి సీనియర్లతో పాటు జూనియర్లు సైతం సత్తా చాటుతూ దుమ్ము రేపుతున్నారు. నువ్వా నేనా అన్న రీతిలో తమ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు.
ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ హెడ్ కోచ్ గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఊహించని రీతిలో విజయాలు నమోదు చేస్తోంది. ఇంకో వైపు డిఫెండింగ్ ఛాంపియన్లు సీఎస్కే, ముంబై ఇండియన్స్ అత్యంత పేలవమైన ఆట తీరుతో నిరాశ పరుస్తుండడం గమనార్హం.
సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించి ఊహించని రీతిలో జట్టు నుంచి అవమానకరంగా బయటకు తనంతకు తానుగా వెళ్లి పోయేలా చేసిన దానికి ప్రతీకారంగా వార్నర్ దుమ్ము రేపుతున్నాడు.
ఇక అతడికి తోడుగా ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నాడు యంగ్ డైనమిక్ ప్లేయర్ పృథ్వీ షా(Prithvi Shaw). డేవిడ్ వార్నర్ తో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడి ఆడాడు. అద్భుతమైన షాట్లతో అలరించాడు.
లీగ్ మ్యాచ్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. 30 బంతుల్లో 60 పరుగులు చేసి వార్నర్ దుమ్ము రేపితే అదే స్థాయిలో పృథ్వీ షా సైతం సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.
కేవలం 10. 3 ఓవర్లలో 119 రన్స్ చేసి లక్ష్యాన్ని ఛేదించింది. షా కేవలం 20 బంతులు మాత్రమే ఆడి 7 ఫోర్లు ఒక సిక్స్ చేసి 41 రన్స్ చేశాడు.
ఇదిలా ఉండగా ఇంకా 57 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ జయ కేతనం ఎగుర వేసింది.
Also Read : లక్నోను దెబ్బ కొట్టిన హాజిల్ వుడ్