David Warner : ప్రపంచ క్రికెట్ లో తన ఆట తీరుతోనే కాదు అద్భుతమైన డ్యాన్సులు, మీమ్స్ తో హోరెత్తించే ఏకైక క్రికెటర్ ఆసిస్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner ). మనోడికి సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఎనలేని అనుబంధం ఉంది.
ఐపీఎల్ లో ఎంటర్ అయ్యాక ఆ జట్టుకు తొలిసారిగా టైటిల్ ను తన సారథ్యంలోనే అందించాడు.
కానీ వార్నర్ ఒక్కసారిగా గత ఏడాది ఐపీఎల్ లో రాణించ లేక పోయాడు.
దీంతో ఆ జట్టు యాజమాన్యం ఈ స్టార్ క్రికెటర్ పట్ల కక్ష సాధింపు ధోరణి ప్రదర్శించింది.
కానీ మేనేజ్ మెంట్ పై పల్లెత్తు మాట మాట్లాడలేదు. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ లో చివరకు ఆటగాళ్లకు కూల్ డ్రింక్స్ కూడా ఇచ్చాడు.
కానీ తన ఆట తీరు పట్ల, తన క్యారక్టర్ పట్ల ఎక్కడా తగ్గలేదు. అయితే వార్నర్(David Warner )పట్ల సన్ రైజర్స్ వ్యవహరించిన తీరు పట్ల
యావత్ క్రీడా లోకం భగ్గుమంది. ప్రధానంగా డేవిడ్ భయ్యా ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.
ఇక 2022 ఐపీఎల్ మెగా వేలం ఫిబ్రవరి 12, 13 లలో బెంగళూరు వేదికగా జరిగింది. ఏ జట్టు అతడిని తీసుకునేందుకు ముందుకు రాలేదు. ఈ సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని డేర్ చేసి తీసుకుంది.
వారి నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇప్పడు జరుగుతున్న ఐపీఎల్ లో వార్నర్ ఆ జట్టు విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఇక తెలుగు సినిమాలు, పాటలు, డైలాగ్ లంటే మనోడికి తెగ పిచ్చి.
ఇటీవల విడుదలై దుమ్ము రేపిన పుష్ప మూవీలోని తగ్గేదే లే అన్న మాటల్ని రివీల్ చేస్తూ ఫోజు ఇచ్చాడు. పంజాబ్ కింగ్స్ పై గెలుపొందాక. ఇందులో మనోడు 30 బంతులు ఆడి 10 ఫోర్లు ఓ సిక్సర్ తో రెచ్చి పోయాడు. 60 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు.
Also Read : ఆడుతూ పాడుతూ నెగ్గిన ఢిల్లీ