MI vs CSK : గతంలో ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్ రిచ్ టోర్నీలో అత్యధిక టైటిళ్లను స్వంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ జట్ల మధ్య అసలైన పోరుకు వేదిక కానుంది.
నవీ ముంబై లోని పీఎండీవై పాటిల్ స్టేడియంలో కీలక మ్యాచ్ రాత్రి జరగనుంది. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్(MI vs CSK )ఆరు మ్యాచ్ లు ఆడి ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసింది.
ఇక ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. ఆడిన ఆరు మ్యాచ్ లలో అజయం మూటగట్టుకుంది. ఈ తరుణంలో అసలైన చాంపియన్లు ఎవరనేది ఇవాళ తేలనుంది.
చెన్నై సూపర్ కింగ్స్ నుంచి – ధోనీ, రాబిన్ ఊతప్ప, రవీంద్ర జడేజా (కెప్టెన్ ) , డెవాన్ కాన్వే, క్రిస్ జోర్డాన్ , అంబటి రాయుడు ఆడతారు..
వీరితో పాటు దీపక్ చాహర్ , డ్వేన్ బ్రావో, ప్రిటోరియస్ , ముకేశ్ చౌదరి, సేనాపతి, ఆసిఫ్ , సాన్ ట్నర్ , భగత్ వర్మ, నారాయణ్ జగదీశన్ ,
హంగేర్కర్ ఆడతారు. ఇక మొయిన్ అలీ, శివం దూబే, ఆడమ్ మిల్నే , హరి నిశాంత్ , మహీశ్ తీక్షణ, సోలంకి, సిమ్రన్ జిత్ సింగ్ , తుషార్ దేశ్ పాండే ఉన్నారు.
ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ కాగా , రమణ్ దీప్ సింగ్ , హృతిక్ షోకీన్ , రాహుల్ బుద్ది,
అర్షద్ ఖాన్, సూర్య కుమార్ యాదవ్ ,కీరన్ పొలార్డ్ , ఇషాన్ కిషన్ , జస్ ప్రీత్ బుమ్రా, బాసిల్ థంపి ఆడతారు. వీరితో పాటు ఆర్యన్ జుయల్ ,
అమూల్ ప్రీత్ సింగ్ , అర్జున్ టెండూల్కర్ , జోఫ్రా ఆర్చర్ , డానియెల్ సామ్స్ , టైమల్ మిల్స్ , డెవాల్డ్ బ్రెవిస్ ,
సంజయ్ యాదవ్ , తిలక్ వర్మ, మురుగన్ అశ్విన్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనాద్కత్ , మయాంక్ మార్కెండే , టిమ్ డేవిడ్ , రిలె మెరిడిత్ ఆడతారు.
Also Read : సెంచరీ మిస్సైనా సెన్సేషన్