Kieron Pollard : వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజాలలో ఒకడిగా పేరొందిన కీరన్ పొలార్డ్(Kieron Pollard) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ లో ఆడుతున్న ఈ క్రికెటర్ ఉన్నట్టుండి తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
క్రికెట్ ఫ్యాన్స్ కు విస్తు పోయేలా షాక్ ఇచ్చాడు. తన క్రికెట్ కెరీర్ లో ఎన్నో అద్భుత విజయాలలో పాలు పంచుకున్నాడు. 15 ఏళ్ల పాటు విండీస్ కు ప్రాతినిధ్యం వహించాడు.
వెస్టిండీస్ తరపున 123 వన్డేలు 101 టీ 20 మ్యాచ్ లు ఆడాడు. ప్రస్తుతం టీ20, వన్డే జట్టుకు కెప్టెన్ గా కూడా ఉన్నాడు. ఇక ఆడలేనంటూ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఇన్ స్టా గ్రామ్ వేదికగా తెలిపాడు.
అయితే ఇక నుంచి క్రికెట్ పరంగా టెస్టులు, వన్డేలు, టీ20 అధికారిక మ్యాచ్ లలో మాత్రం పాల్గొనడు. కానీ ఫ్రాంచైజీ స్థాయిలలో జరిగే టీ20, టీ10 లీగ్ లను ఆడుతాడు.
ఇంతే కాదు కొన్ని చిరస్మరణీయమైన సన్నివేశాలతో కూడిన వీడియోలను కూడా పంచుకున్నాడు. ఇక తన కెరీర్ విషయానికి వస్తే కీరన్ పొలార్డ్ 2007లో వెస్టిండీస్ తరపున అరంగేట్రం చేశాడు.
34 ఏళ్ల వయసున్న పొలార్డ్(Kieron Pollard) కు ముంబై ఇండియన్స్ తో ఎనలేని, విడదీయరాని అనుబంధం ఉంది. చాలా రోజుల నుంచి మధన పడుతూ వస్తున్నా. ఇక తప్పు కోవాలని నిర్ణయం తీసుకున్నా.
10 ఏళ్ల వయసు నుంచి వెస్టిండీస్ కు ఆడాలనేది నా కల. అది నెరవేరింది. అవకాశం ఇచ్చిన క్రికెట్ బోర్డుకు, సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు పొలార్డ్ తెలిపాడు.
Also Read : తగ్గేదే లే అంటున్న డేవిడ్ భయ్యా