Kieron Pollard : సుదీర్గ క్రికెట్ రణరంగం నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు విండీస్ క్రికెట్ దిగ్గజం కీరన్ అడ్రియన్ పొలార్డ్(Kieron Pollard ). 12 మే 1987లో పుట్టాడు. స్టార్ పేసర్ , ఆల్ రౌండర్ గా పేరొందాడు.
తన క్రికెట్ కెరీర్ లో 15 ఏళ్ల పాటు వెస్టిండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ లో ఉన్నట్టుండి తాను నిష్క్రమిస్తున్నట్లు వెల్లడించాడు.
2010లో ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో ఎంటర్ అయ్యాడు. ఆనాటి నుంచి నేటి దాకా ముంబై ఇండియన్స్ తో తన జర్నీని కొనసాగిస్తూ వస్తున్నాడు కీరన్ పొలార్డ్ . 2019లో వన్డే, టీ20 ఫార్మాట్ లకు విండీస్ తరపున కెప్టెన్ గా ఎంపికయ్యాడు.
2021లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో అకిల ధనంజయ వేసిన ఒక ఓవర్ లో ఆరు సిక్సర్లు కొట్టాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో హర్షల్ గిబ్స్ , యువరాజ్ సింగ్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు పొలార్డ్(Kieron Pollard ).
ఫిబ్రవరి 2022లో ఇండియాతో జరిగిన రెండో మ్యాచ్ లో విండీస్ తరపున 100 టీ20 మ్యాచ్ లు ఆడిన మొదటి క్రికెటర్ గా నిలిచాడు. ఐపీఎల్ వేదికగా తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించి విస్తు పోయేలా చేశాడు.
అత్యంత విజయవంతమైన టీ20 క్రికెట్ లో ఒకడిగా పేరొందినా వెస్టిండీస్ తరపున అంతగా రాణించ లేక పోయాడు పొలార్డ్Kieron Pollard). 123 వన్డే మ్యాచ్ లలో 55 వికెట్లు తీశాడు. 26 కంటే ఎక్కువ సగటుతో 2, 706 రన్స్ చేశాడు.
101 టీ20 మ్యాచ్ లలో 1,569 పరుగులు చేశాడు. 44 వికెట్లు తీశాడు. 17 మార్చి 2010లో ముంబై ఇండియన్స్ తరపున పొలార్డ్ అరంగేట్రం చేశాడు. ముంబై ఇండియన్స్ ఫైనల్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.
ఆనాటి నుంచి 2022 దాకా ముంబైతో తన అనుబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. ఆ జట్టు యాజమాన్యం అతడిపై పూర్తి స్థాయిలో నమ్మకం పెట్టుకుంది.
తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆ జట్టు హెడ్ కోచ్ జయవర్దనే, కెప్టెన్ రోహిత్ శర్మ, జట్టు సభ్యులు గొప్ప ఆటగాడంటూ కితాబు ఇచ్చారు.
Also Read : మొబైల్ మాయలో నేటి యువత