Sachin Pollard : పొలార్డ్ నిర్ణ‌యం ఆట‌గాళ్ల విస్మ‌యం

కీర‌న్ ఎందుకు ఇంత త్వ‌ర‌గా వెళ్లి పోవ‌డం

Sachin Pollard  : ప్ర‌పంచ క్రికెట్ లో త‌న కంటూ ఓ ప్లేస్ ను సంపాదించుకున్న అరుదైన విండీస్ క్రికెట‌ర్ కీర‌న్ పొలార్డ్(Sachin Pollard ) . త‌న ఆట‌తోనే కాదు త‌న చేష్ట‌ల‌తో ఎంద‌రో మ‌నసుల్ని సంపాదించుకున్నాడు.

ప్ర‌త్యేకించి ఈ దిగ్గ‌జ ఆట‌గాడికి భార‌త్ తో విడ‌దీయ‌రాని అనుబంధం ఉంది. అది ఎంత‌లా అంటే త‌న కెరీర్ మొత్తంలో 15 ఏళ్లు ఉంటే అందులో 2010 నుంచి ఇండియాలోని ఐపీఎల్ తో ఆడుతూ వ‌స్తున్నాడు.

ముంబై ఇండియ‌న్స్ తో సుదీర్ఘ కాలం అనుబంధాన్ని కొన‌సాగించాడు. అందుకే ఆ జ‌ట్టుకు చెందిన వారంతా పొలార్డ్ నిర్ణ‌యాన్ని జీర్ణించు కోలేక పోతున్నారు. తాజా మాజీ ఆట‌గాళ్లు సైతం విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

20న సాయంత్రం తాను త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు పొలార్డ్ . 34 ఏళ్ల వ‌య‌సున్న పొలార్డ్ (Sachin Pollard ) ఈ నిర్ణ‌యాన్ని త‌న ఇన్ స్టా గ్రామ్ ద్వారా వెల్ల‌డించాడు. అత‌డి నిర్ణ‌యంపై తాజా, మాజీ ఆటగాళ్లు విస్మ‌యం వ్య‌క్తం చేశారు.

ఏం వ‌య‌సు మించి పోయింద‌ని ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నామ‌ని స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు పేర్కొన్నారు. ఇక బ్యాటింగ్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ అయితే పొలార్డ్ ను ఫైట‌ర్ గా పేర్కొన్నారు.

తాను ఇప్ప‌టికీ న‌మ్మ‌లేక పోతున్నానంటూ వాపోయాడు సునీల్ స‌రైన్. అత్యంత ప్ర‌శాంత‌మైన క్రికెట‌ర్ అంటూ మైఖేల్ వాన్ పేర్కొన్నాడు. విండీస్ క్రికెట‌ర్ క్రిస్ గేల్ అయితే విస్మ‌యం వ్య‌క్తం చేశాడు.

దీనిని న‌మ్మ‌లేక పోతున్నాన‌ని తెలిపాడు. 15 ఏళ్ల పాటు విండీస్ కంట్రీకి అత‌డు అందించిన సేవ‌లు గొప్ప‌వ‌ని పేర్కొంది విండీస్ క్రికెట్ బోర్డు.

Also Read : క్రికెట్ కు కీర‌న్ పొలార్డ్ గుడ్ బై

Leave A Reply

Your Email Id will not be published!