Nita Ambani :భారత దేశంలో అత్యంత జనాదరణ ఆట ఏదైనా ఉందంటే అది క్రికెట్ ఒక్కటే. ప్రధానంగా ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి కేవలం ప్రసార హక్కుల ద్వారా రూ. 50 వేల కోట్లు వస్తున్నాయి.
కేవలం ఐదేళ్లలో. ఇప్పటి వరకు ఐపీఎల్ లో అత్యధిక డబ్బులు కలిగిన ఫ్రాంచైజీ ఏది అంటే అదే రిలయన్స్ గ్రూప్ దే. ఈ సంస్థ ఏరికోరి ముంబై ఇండియన్స్ ను తీసుకుంది.
సచిన్, మహేళ జయవర్దనే, జాంటీ రోడ్స్ లాంటి దిగ్గజ ఆటగాళ్లను మెంటార్స్ గా ఎంపిక చేసింది. ఆ జట్టు మొదటి నుంచీ టాప్ లో ఉంటూ వచ్చింది. కానీ గత రెండు సీజన్ల నుంచి దాని పతనం మొదలైంది.
ఇప్పటికీ ఆ జట్టు అన్ని ఫార్మాట్ లలో బలంగానే ఉంది. కానీ మైదానంలోకి వచ్చే సరికల్లా చేతులెత్తేస్తోంది. భారత జట్టుకు సారథిగా ఉన్న రోహిత్ శర్మ ముంబైకి కెప్టెన్ గా ఉన్నాడు.
జట్టును ఒంటి చేత్తో గెలిపించగల సత్తా కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఐపీఎల్ లో అత్యంత చెత్త ప్రదర్శన తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు 7 మ్యాచ్ లు ఆడింది. ఇందులో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ విజయం సాధించ లేక పోయింది. ఇక ప్లే ఆఫ్స్ ఆశలు కష్టమే.
టైటిల్ ఫెవరేట్ గా ఉంటూ వచ్చిన ఈ జట్టు అనూహ్యంగా ఇంటి బాట పట్టేందుకు రెడీగా ఉండడాన్ని ఆ జట్టు అభిమానులే కాదు జట్టు మేనేజ్ మెంట్ కు చీఫ్ గా ఉన్న నీతా అంబానీ(Nita Ambani )సైతం నిరాశలో కూరుకు పోయింది.
మనోళ్ల ఆట తీరు చూసి ఆమె తల పట్టుకుంది. ప్రస్తుతం నీతా అంబానీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ దీనంగా ఉన్న ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
Also Read : పని చేయని హిట్ మ్యాన్ మంత్రం