Dwayne Bravo : క్రికెట్ అన్నది కోట్లాది అభిమానులను పెంచుకుంటూ పోతోంది. దానికి ఉన్నంత క్రేజ్ ఇంకే ఆటకు లేదంటే నమ్మలేం. ముంబై వేదికగా జరుగుతున్న 2022 లో అరుదైన సన్నివేశాలకు వేదికగా మారింది.
సీనియర్లతో పాటు జూనియర్లు సైతం దుమ్ము రేపుతున్నారు. తాజాగా ఓ అద్భుతం చోటు చేసుకుంది. అదేమిటో కాదు ప్రపంచ క్రికెట్ లో 15 ఏళ్ల పాటు తన దేశానికి సేవలు అందిస్తూ వచ్చిన అరుదైన క్రికెటర్ కీరన్ పొలార్డ్ .
అతడికి ఆ దేశం కంటే భారత్ తో ఎక్కువ బంధం ఉంది. 2010 నుంచి ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో ఆడుతూ వస్తున్నాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు.
తాజాగా జరుగుతున్న ఐపీఎల్ లో ఊహించని రీతిలో తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తాజా, మాజీలతో పాటు ఫ్యాన్స్ ను విస్తు పోయేలా చేశాడు కీరన్ పొలార్డ్.
తన అద్భుతమైన ప్రతిభా పాటవాలతో ఎన్నో విజయాలు చేకూర్చి పెట్టాడు పొలార్డ్. ఈ సందర్భంగా కీలక మ్యాచ్ జరిగింది ముంబైలో. చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ ఉత్కంఠ పోరులో ముంబై ఓడి పోయింది చెన్నై గెలిచింది. మ్యాచ్ జరిగే కంటే ముందు ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తున్న డ్వేన్ బ్రావో పొలార్డ్(Dwayne Bravo )కాళ్లు మొక్కాడు.
వద్దని వారించినా అలాగే పాదాలు తాకాడు. అతడిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు పొలార్డ్. ఈ సన్నివేశం, ఈ క్రీడా స్పూర్తికి అభిమానులు ఫిదా అవుతున్నారు.
Also Read : తీవ్ర నిరాశలో నీతా అంబానీ