Covid19 : దేశంలో కరోనా మెల మెల్లగా తగ్గుముఖం పడుతున్నా కొన్ని చోట్ల అది తన ప్రతాపాన్ని చూపిస్తోంది. గత రెండు రోజుల్లో 30 మందికి కరోనా(Covid19 )పాజిటివ్ రావడం ఐఐటీ మద్రాస్ లో కలకలం రేపింది.
ఇవాళ 18 మందికి పరీక్షల్లో కరోనా సోకినట్లు నిర్దారించారు. దీంతో అంతటా అప్రమత్తం చేశారు. తమిళనాడులో గురువారం ఒక్క రోజే కొత్తగా 39 కరోనా కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో కేసుల సంఖ్య 34 లక్షల 53 వేల 390కి పెరిగింది. గత 24 గంటల్లో ఇప్పటి వరకు మరణాల సంఖ్య 38 వేల 25 చేరింది. కొత్త కేసుల పెరుగుదలను గమనించిన ప్రభుత్వం కరోనా(Covid19 )కంట్రోల్ కోసం చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం 18 వేల కేసుల నుంచి 25 వేల నమూనాల పరీక్షను పెంచాలని ఆరోగ్య శాఖను ఆదేశించింది. ఇదిలా ఉండగా ఐఐటీ మద్రాస్ క్యాంపస్ లో చదువుతున్న వారికి కరోనా సోకడం గురించి తెలుసుకున్న రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి జె. రాధాకృష్ణన్ సందర్శించారు.
గత కొన్ని రోజులుగా 20 కంటే తక్కువ కేసులు నమోదవుతున్న చెన్నైలో 21 కేసులతో కొత్త కరోనా వైరస్ నమోదైంది. తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్ పేటలో ఆరు కేసులు, వెల్లూరరు , తంజావూరులో వరుసగా 2 కేసులు నమోదయ్యాయి.
కాంచీపురం, నాగపట్నం, నమక్కల్ , తిరుపత్తూరు, తిరువళ్లూరు, తిరువారూర్ లో ఒక్కో కేసు నమోదైంది. మొత్తం మీద 7, 51, 356 కేసులతో రాష్ట్ర రాజధాని చెన్నై ముందంజలో ఉంది.
కొన్ని రాష్ట్రాలు బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ లు ధరించాలని కొన్ని రాష్ట్రాలు ఆదేశించాయి. ప్రస్తుతం కరోనా సోకడంతో మరింత కట్టుదిట్టంగా ఉండాలని సూచించింది సర్కార్.
Also Read : జమ్మూలో ఇద్దరు ఉగ్రవాదులు హతం