Lalu Prasad Yadav : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డోరండా ట్రెజరీ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇదిలా ఉండగా డోరాండా ట్రెజరీ నుండి రూ. 139 కోట్లకు సంబంధించి దాణా కుంభకోణం కేసులో ఫిబవ్రిలో సీబీఐ కోర్టు దోషిగా నిర్దారించింది. ఈ మేరకు శిక్ష కూడా ఖరారు చేసింది.
దీంతో 73 ఏళ్ల వయసు కలిగిన లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కస్టడీలో ఉన్నారు. కాగా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించి జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.
సస్పెన్షన్ కోసం తమ పిటిషన్ ను స్వీకరించిందని, బెయిల్ మంజూరు చేసినట్లు లాలూ తరపు న్యాయవాది వెల్లడించారు. ఈ కేసులో తన ఐదేళ్ల కాలపు శిక్షలో సగం అనుభవించాడని తెలిపారు.
ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్ 41 నెలల శిక్ష అనుభవించాడు. ట్రయల్ కోర్టు సర్టిఫైడ్ కాపీని సమర్పించారు. దీంతో కోర్టు బెయిల్ మంజూరు చేసిందని న్యాయవాది ప్రభాత్ కుమార్ వెల్లడించారు.
కాగా రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు మంగళవారం నాటికి దిగువ కోర్టుకు అందుతాయని తెలిపారు. అప్పటి వరకు బెయిల్ బాండును సమర్పించి విడుదల ఆర్డర్ ను పొందుతామన్నారు.
దాణా కుంభకోణం కేసులో శిక్షను సవాల్ చేస్తూ జైలులో ఉన్న లాలూ ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను జార్ఖండ్ హైకోర్టు ఏప్రిల్ 8న వాయిదా వేసింది.
ఈ దాణా కుంభకోణం కేసులో మాజీ సీఎంకు రాంచీ లోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 60 లక్షల జరిమానా విధించింది.
Also Read : ద్వేషపూరిత ప్రసంగం అఫిడవిట్ పై ఫైర్