DC vs RR : ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ తన జైత్రయాత్రను కొనసాగిస్తూ వస్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్ లలో ఒకటి మాత్రమే ఓటమి పాలై పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది.
ముంబై వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్(DC vs RR )అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రిచ్ లీగ్ లో బిగ్ స్కోర్ చేసింది.
ఇప్పటి వరకు రాజస్థాన్ చేసిన పరుగులే టార్గెట్. ఒక రకంగా ఇరు జట్లు పరుగుల వరద పారించాయని చెప్పక తప్పదు.
ఇక ఒకే ఒక్కడు జాస్ బట్లర్ మరోసారి దుమ్ము రేపాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుసగా ఈ మెగా లీగ్ లో మూడో సెంచరీ. ఇక మరో ఓపెనర్ దేవదత్ పడికల్ తో పాటు కెప్టెన్
సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి రాజస్థాన్ రాయల్స్ 222 పరుగులు చేసింది.
ఇక ఆర్ఆర్ టార్గెట్ ను ఛేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC vs RR )చివరి దాకా పోరాడింది. కానీ 15 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఇక కేవలం 65 బంతులు మాత్రమే ఆడి 9 సిక్స్ లు 9 ఫోర్లతో 116 పరుగులు చేసిన
ఇంగ్లండ్ స్టార్ హిట్టర్ జోస్ బట్లర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.
దేవదత్ పడిక్కల్ 35 బంతులు ఆడి 54 రన్స్ చేశాడు. ఇందులో 7 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి. బట్లర్ , పడిక్కల్ కలిసి మొదటి వికెట్ కు ఏకంగా 91 బంతులు ఆడి 155 రన్స్ చేశారు.
అనంతరం బరిలోకి వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ 19 బంతులు ఆడి 5 ఫోర్లు 3 సిక్స్ లతో 46 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు.
Also Read : జోస్ బట్లర్ పడిక్కల్ సయ్యాట