Prasidh Krishna : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ (Prasidh Krishna)అద్భుతంగా రాణించాడు. మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది.
223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ పోరాడింది. గెలుపు కోసం విశ్వ ప్రయత్నం చేసింది. కానీ మ్యాచ్ ను మలుపు తిప్పింది మాత్రం 19 ఓవర్ అని చెప్పక తప్పదు.
ఢిల్లీ విజయం సాధించాలంటే చివరి 2 ఓవర్లు 12 బంతులు 36 పరుగులు కావాలి. అయితే 19వ ఓవర్ వేసిన ప్రసిద్ధ్ కృష్ణ (Prasidh Krishna) మ్యాజిక్ చేశాడు. ఒక రకంగా ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లాడు.
ఆ ఓవర్ లో ఒక్క పరుగు ఇవ్వలేదు. ఆపై కుల్దీప్ యాదవ్ వికెట్ ను తీశాడు. దీంతో 20వ ఓవర్ ఓడెమ్ కు ఇచ్చాడు కెప్టెన్ శాంసన్. ఇక ఓవరాల్ గా మొత్తం మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేశాడు ప్రసిద్ధ్ కృష్ణ.
ఇందులో ఒక మెయిడెన్ ఉండడం విశేషం. 22 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఆఖరులో మ్యాచ్ ను పూర్తిగా రాజస్థాన్ చేతిలోకి వచ్చేలా చేశాడు.
గెలవాలంటే ఒక ఓవర్ లో ఆరు సిక్సర్లు కొట్టాలి. కానీ ఆ ఛాన్స్ ఎంత మాత్రం ఇవ్వకుండా అద్భుమైన బంతుల్ని వేశాడు ప్రసిద్ధ్ కృష్ణ . టీ20 మ్యాచ్ లో మ్యాచ్ ముగిసే సమయంలో మెయిడెన్ ఓవర్ వేయడం అన్నది మామూలు విషయం కాదు.
ఇదిలా ఉండగా 2018లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు కృష్ణ. భారీ ఎత్తున ధర పెట్టి కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్ . మొత్తంగా కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు ప్రసిద్ధ్ కృష్ణ.
Also Read : ఢిల్లీ పోరాటం ప్రశంసనీయం