Jos Butler Chahal : ‘ఆరెంజ్..పర్పుల్’ క్యాప్ రేసులో రాజస్థాన్
జోస్ బట్లర్ ..యుజ్వేంద్ర చాహల్ టాప్
Jos Butler Chahal : ఐపీఎల్ లో టోర్నీ ముగిశాక బ్యాటర్లలో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్ , ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ కు పర్పుల్ క్యాప్ అందజేస్తారు. భారీగా ప్రైజ్ మనీ కూడా ఉంటుంది.
విచిత్రం ఏమిటంటే ఈసారి ఊహించని రీతిలో ఈ రెండు విభాగాలలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతనిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు టాప్ లో ఉండడం విశేషం.
పాయింట్ల పట్టికలో ఇవాల్టి వరకు రాజస్తాన్ టాప్ లో ఉంది. ఇక ఆరెంజ్ క్యాప్ విషయానికి వస్తే స్టార్ ఓపెనర్ రాజస్థాన్ రాయల్స్ కు చెందిన ఇంగ్లండ్ ప్లేయర్ జోస్ బట్లర్ (Jos Butler Chahal ) టాప్ లో ఉన్నాడు.
మొత్తం ఇప్పటి వరకు ఏడు మ్యాచ్ లు ఆడిన బట్లర్ ఏకంగా 491 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఇక బట్లర్ (Jos Butler Chahal ) తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ 265 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కు చెందిన ఓపెనర్ పృథ్వీ షా 254 రన్స్ తో మూడో ప్లేస్ లో కొనసాగుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కిప్పర్ 250 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా శివమ్ దూబే 239 రన్స్ తో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ స్టార్ బౌలర్ యజ్వేంద్ర చాహల్ టాప్ లో ఉన్నాడు. ఇప్పటి వరకు 7 మ్యాచ్ లలో 18 వికెట్లు తీశాడు.
అతడి తర్వాత కుల్దీప్ యాదవ్ 13 వికెట్లతో ఉండగా డ్వేన్ బ్రావో 12 వికెట్లతో మూడో స్థానంలో, టి. నటరాజన్ 12 వికెట్లతో నాలుగో ప్లేస్ లో ఉంటే ఖలీల్ అహ్మద్ 11 వికెట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.
Also Read : ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లిన ప్రసిద్ధ్ కృష్ణ