Sourav Ganguly : భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ ) చీఫ్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) ఆసక్తికర ప్రకటన చేశారు. ఆదివారం ఆయన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ ( ఐపీఎల్ ) కు సంబంధించి ప్లే ఆఫ్స్ తో పాటు ఫైనల్ మ్యాచ్ వేదికలను ఖరారు చేసినట్లు ప్రకటించారు.
ఈ మేరకు అపెక్స్ కౌన్సిల్ తో భేటీ ముగిసింది. అనంతరం గంగూలీ మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఐపీఎల్ కు సంబంధించి 14 సీజన్లు ముగిశాయి. ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ సీజన్ 15వది.
ఇప్పటి దాకా 35 లీగ్ మ్యాచ్ లు ముగిశాయి. ఇంకా సగం అంటే 35 లీగ్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. గతంలో 8 జట్లు పాల్గొంటే ఈసారి 10 జట్లు పాల్గొంటున్నాయి. దీంతో ప్లే ఆఫ్స్ ఎక్కడ నిర్వహిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
వచ్చే మే నెల 24, 26 తేదీలలో క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్ లకు కోల్ కతా వేదిక కానుంది. ఇక మే 27న జరగనున్న క్వాలిఫయర్ 2, ఎలిమినేటర్ తో పాటు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మే 29న జరగనుంది.
ఇందుకు సంబంధించి అహ్మదాబాద్ ను ఖరారు చేసినట్లు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) వెల్లడించారు. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు అపెక్స్ కౌన్సిల్ లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు దాదా.
మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రకటించారు. ప్లే ఆఫ్స్ కు, ఫైనల్ మ్యాచ్ కు 100 శాతం ప్రేక్షకులను అనుమతి ఇస్తున్నట్లు గంగూలీ స్పష్టం చేశారు.
ఇంతే కాకుండా మే 24 నుంచి 28 వరకు లక్నో వేదికగా మూడు జట్లతో మహిళల టీ20 చాలెంజర్స్ టోర్నీ చేపడతామన్నారు.
Also Read : హమ్మయ్య ముద్దుగుమ్మ నవ్వింది