Hanuman Chalisa Row : ఎంపీ నవనీత్ , ఎమ్మెల్యే రవి రాణాలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని కస్టడీకి తరలించాలని కోర్టు ఆదేశించింది. దీంతో 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపారు.
అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ , ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణా బాంద్రా బయట మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా(Hanuman Chalisa Row) పఠిస్తామంటూ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు వార్నింగ్ ఇచ్చారు.
దీంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని, ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేశారంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులను భారీగా మోహరించడం, శివసేన కార్యకర్తల భారీ నిరసన కారణంగా తాము ఇంటి నుంచి బయటకు రావడానికి పర్మిషన్ ఇవ్వడం లేదంటూ ఎంపీ నవనీత్ కౌర్ ఆరోపించారు.
హిందూత్వంపై సీఎం తన వైఖరి తెలియ చేయాలని, ఇంటి బయట హిందూ దేవుడిని స్తుతిస్తూ గీతాలాపన చేస్తామని హెచ్చారించారు. దీంతో శివసేన పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ సీరియస్ అయ్యారు.
ఇదంతా కేవలం తమ ఉనికి కోసం ఆడుతున్న డ్రామాగా కొట్టి పారేశారు ఆదివారం మోదీ పర్యటన ఉండడంతో ఎంపీ, ఎమ్మెల్యేలు కాస్తా వెనక్కి తగ్గారు.
తాము పాడాల్సిన హనుమాన్ చాలీసా భక్తులతే పాడబడిందన్నారు నవనీత్ కౌర్ , రవి రాణాలు. శివసేన గూండాల పార్టీగా మారింది. ఉద్దవ ఠాక్రేకు నేరాలను నమోదు చేయించడం, కటకటాలకు నెట్టడమే తెలుసని ఆరోపించారు.
ముంబైని పశ్చిమ బెంగాల్ లాగా చేయాలని చూస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఐపీసీ 153 ఏ , 34, సెక్షన్ 135 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read : పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం