Modi : జమ్మూ కాశ్మీర్ లో అట్టడుగు స్థాయికి ప్రజాస్వామ్యం చేరుకుందన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi ). ఆర్టికల్ 370 ని 2019 లో రద్దు చేసిన తర్వాత మొదటిసారిగా ప్రధాని పర్యటించారు.
ఈ సందర్భంగా జమ్మూ లోని పల్లి గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. యువతను ప్రధానంగా ప్రస్తావించారు. జమ్మూ కాశ్మీర్ లోని మీ తల్లిదండ్రులు, తాతలు పడిన కష్టాలను గుర్తు తెచ్చుకోవాలన్నారు.
ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఇక నుంచి ఉండవన్నారు. ఎప్పటికీ అలాంటి జీవితం గడపాల్సిన అవసరం లేకుండా చేస్తానని చెప్పారు మోదీ. దీనిని మాటల్లో కాకుండా చేతుల్లో చూపిస్తామన్నారు.
అన్ని రంగాలలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జమ్మూ , కాశ్మీర్ లో జరుపు కోవడం ఆనందంగా ఉందన్నారు.
ఇది దేశ చరిత్రలో పెను మార్పును సూచిస్తోందన్నారు ప్రధానమంత్రి. ఇక్కడ ప్రజాస్వామ్యం అట్టడుగు దాకా వెళ్లిందన్నారు. ఇది గర్వించ దగిన విషయమని పేర్కొన్నారు.
ఇక్కడి నుంచే దేశ వ్యాప్తంగా ఉన్న పంచాయతీలతో సంభాషిస్తున్నానని చెప్పారు నరేంద్ర మోదీ(Modi ). కేంద్ర పాలిత ప్రాంతం అభివృద్ధికి సంబంధించి కొత్త కథను రాసేందుకు రెడీగా ఉందన్నారు.
స్వతంత్రం వచ్చాక గత ఏడు దశాబ్దాల కాలంలో జమ్మూ , కాశ్మీర్ కు కేవలం రూ. 17 వేల కోట్లు వచ్చాయన్నారు. కానీ తాము ఆ సంఖ్యను ఇప్పుడు రూ. 38, 000 కోట్లకు చేర్చామని చెప్పారు ప్రధాన మంత్రి.
తమ దృష్టి కనెక్టివిటీ, బ్రిడ్డింగ్ దూరాలపై ఉంటుందన్నారు. జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రాల అభివృద్ధే తమ ముందున్న లక్ష్యమన్నారు మోదీ.
Also Read : రైతు ఆవిష్కరణలను ప్రోత్సహించాలి