Shikhar Dhawan : భారత స్టార్ ప్లేయర్ గా పేరొందిన శిఖర్ ధావన్ మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై వేదికగా లీగ్ మ్యాచ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో పంజాబ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ధావన్ కీలక పాత్ర పోషించాడు.
కేవలం 59 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శిఖర్ ధావన్(Shikhar Dhawan) 88 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 9 ఫోర్లు 2 సిక్స్ లు ఉన్నాయి. ఐపీఎల్ లో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది ధావన్ కు. భారత బి క్రికెట్ టీంకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు.
ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ కాకుండా పంజాబ్ కింగ్స్ శిఖర్ ధావన్ ను కొనుగోలు చేసింది. ధావన్ కు 36 ఏళ్లు. ఢిల్లీ స్వస్థలం. 2013 లీగ్ కు ముందు శిఖర్ ధావన్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు.
అతడి స్థానంలో డారన్ సామీ నాయకత్వం వహించాడు. 2017లో ఐపీఎల్ కోసం హైదరాబాద్ కొనుగోలు చేసింది. టోర్నీలో 14 మ్యాచ్ లు ఆడి 479 రన్స్ చేశాడు. ప్లే ఆఫ్స్ లో కేకేఆర్ చేతిలో ఓడి పోయింది.
2018 ఐపీఎల్ లో తిరిగి హైదరాబాద్ రైటు టు మ్యాచ్ కార్డ్ ఉపయోగించి రూ. 5. 2 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ లీగ్ లో 497 రన్స్ చేశాడు. ఫైనల్ లో హైదరాబాద్ ఓటమి పాలైంది. 2019లో ధావన్ రెండు సెంచరీలు చేశాడు.
5000 పరుగులు పూర్తి చేశాడు. 2020లో టాప్ స్కోరర్ ల లిస్టులో ధావన్ 3వ స్థానంలో నిలిచాడు. 600 రన్స్ చేశాడు. 2021 ఐపీఎల్ లో 587 పరుగులు చేశాడు.
ఆరెంజ్ క్యాప్ జాబితాలో నాల్గో ప్లేస్ దక్కించుకున్నాడు. 2022 ఐపీఎల్ లో పంజాబ్ రూ. 8.25 కోట్లకు ధావన్ ను కొనుగోలు చేసింది.
Also Read : ముంబై బాట పట్టిన చెన్నై