RR vs RCB : ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ దూసుకు పోతోంది. అంచనాలకు అందని రీతిలో ఒక్కో మ్యాచ్ ను చేజిక్కించుకుంటూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది.
బ్యాటింగ్ లో ఆశించిన మేర రాణించక పోయినా బౌలర్లు గెలిపించే బాధ్యతను తమ భుజాన వేసుకున్నారు. ఊహించని రీతిలో నువ్వా నేనా అన్న చందంగా నడిచిన మ్యాచ్ లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు (RR vs RCB)కెప్టెన్ పాఫ్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మెగా రిచ్ లీగ్ లో దంచి కొడుతూ వస్తున్న వరల్డ్ స్టార్ హిట్టర్ , ఇంగ్లండ్ బ్యాటర్ జోస్ బట్లర్ నిరాశ పరిచాడు.
దీంతో అతడినే నమ్ముకున్న మిగతా బ్యాటర్లు వరుసగా క్యూ కట్టారు. కెప్టెన్ సంజూ శాంసన్ మెరిసినా కొద్ది సేపే. హసరంగ బౌలింగ్ లో మరోసారి అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత రెచ్చి పోతాడని అనుకున్న హిట్ మైర్ చాప చుట్టేశాడు. ఈ తరుణలో రియాన్ పరాగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. హాఫ్ సెంచరీతో మెరిశాడు.
ఇక అద్భుతమైన బంతులతో కుల్దీప్ సేన్ , రవిచంద్రన్ అశ్విన్ మాయ చేశారు. దీంతో 8 మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్ 6 మ్యాచ్ లలో గెలుపొంది 12 పాయింట్లు సాధించింది.
ఇక హైదరాబాద్ తో 68 పరుగులకే ఆలటైన ఆర్సీబీని 115 పరుగులకే కట్టడి చేసింది రాజస్థాన్. కోహ్లీ ఓపెనర్ గా వచ్చినా జట్టును రక్షించ లేక పోయాడు. నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్లు కోల్పోయి 144 రన్స్ చేసింది.
Also Read : ఆ రెండు జట్లకే టైటిల్ గెలిచే ఛాన్స్