Kuldeep Sen : ఎవరీ కుల్దీప్ సేన్ అనుకుంటున్నారా. మోస్ట్ పాపులర్ బౌలర్ గా ప్రస్తుతం ఐపీఎల్ లో పేరొందాడు. అతడిని ఏరికోరి రాజస్థాన్ రాయల్స్ మేనేజ్ మెంట్ తీసుకుంది.
తనపై నమ్మకం ఉంచిన జట్టుకు అద్భుత విజయాన్ని చేకూర్చి పెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా లీగ్ మ్యాచ్ లో భాగంగా ముంబైలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో శివమెత్తాడు.
అద్భుతమైన బంతులతో తిప్పేశాడు. కేవలం 4 ఓవర్లు మాత్రమే వేసిన కుల్దీప్ సేన్(Kuldeep Sen) ఏకంగా 4 వికెట్లు తీశాడు. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉండగా రాజస్థాన్ రాయల్స్ బెంగళూరుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించింది రియాన్ పరాగ్ . 56 రన్స్ చేశాడు. 4 అద్భుతమైన క్యాచ్ లు పట్టాడు. ఇక బౌలర్లలో కుల్దీప్ సేన్ తో పాటు రవిచంద్రన్ అశ్విన్ సూపర్ గా బౌలింగ్ చేశారు.
కుల్దీప్ సేన్ స్వస్థలం మధ్య ప్రదేశ్ లోని రేవా జిల్లా హరిహర్ పూర్ ఊరు . 22 అక్టోబర్ 1996లో పుట్టాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
అతని తండ్రి రామ్ పాల్ సేన్ మంగలి. ఐదుగురు పిల్లల్లో మూడో వాడు కుల్దీప్ సేన్(Kuldeep Sen). ఎనిమిది ఏళ్ల వయసు నుంచి క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. 2018-19 రంజీ ట్రోఫీలో మధ్య ప్రదేశ్ తరపున ఆడాడు. పంజాబ్ పై 5 వికెట్లు తీశాడు.
2019లో మధ్య ప్రదేశ్ తరపున టీ20 లో ఆడాడు. ఇదిలా ఉండగా బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13లో జరిగిన మెగా ఐపీఎల్ వేలంలో కుల్దీప్ సేన్ ను రాజస్థాన్ రాయల్స్ చేజిక్కించుకుంది.
Also Read : ఆ రెండు జట్లకే టైటిల్ గెలిచే ఛాన్స్