Sidhu : భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్, హోస్ట్, పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ నవ జ్యోత్ సింగ్ సిద్దూ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో ఆయన భేటీ కావడం ఇప్పుడు వైరల్ గా మారింది.
స్వతహాగా తానే పీకేతో కలిసిన ఫోటోను షేర్ చేశారు సిద్దూ(Sidhu ). విచిత్రం ఏమిటంటే ఆయన సారథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది.
117 సీట్లకు గాను కేవలం 18 సీట్లకు మాత్రమే పరిమితం కాగా ఆమ్ ఆద్మీ పార్టీ 92 సీట్లు కైవసం చేసుకుని పవర్ లోకి వచ్చింది. ఈ సందర్భంగా గెలిచిన వెంటనే ఆప్ ను ప్రశంసించారు సిద్దూ.
అంతే కాదు నిజాయితీ గెలిచిందంటూ కామెంట్ చేయడం కలకలం రేపింది. ఎన్నికలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆదేశించింది పార్టీ హైకమాండ్ .
దీంతో గత్యంతరం లేక సిద్దూ తప్పుకున్నారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీతో ములాఖత్ అయ్యారు.
ఆయన నాలుగు సార్లకు పైగా గాంధీ ఫ్యామిలీతో భేటీ కావడం చర్చకు దారితీసింది.
ఈ సందర్బంగా పీకే బ్లూ ప్రింట్ ఇచ్చారు. 600 పేజీలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమర్పించారు.
పనిలో పనిగా రోడ్ మ్యాప్ కూడా సిద్దం చేశారు. దీనిపై సోనియా గాంధీ సంతృప్తి వ్యక్తం చేసింది.
పీకేను తమ పార్టీలో చేరాలని ఆఫర్ కూడా ఇచ్చింది. ఎందుకనో పీకే తిరస్కరించారు.
కాంగ్రెస్ ఇంకా మారాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేయడం కలకలం రేపింది.
తాజాగా ప్రశాంత్ కిషోర్ తో సిద్దూ(Sidhu )భేటీ కావడం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా సిద్దూ ఓ క్యాప్షన్ కూడా జత చేశాడు.
నా పాత స్నేహితుడు పీకేతో అద్భుతమైన సమావేశం జరిగింది. ఓల్డ్ వైన్ పాత బంగారం , పాత స్నేహితులు ఎప్పటికీ ఉత్తమమైనవి అంటూ పేర్కొన్నారు.
Also Read : మాజీ పీసీసీ చీఫ్ జాఖర్ కు బిగ్ షాక్