Muttiah Muralitharan : శ్రీలంక క్రికెట్ దిగ్గజం, ప్రముఖ లెగ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్(Muttiah Muralitharan) చాలా సౌమ్యుడు. అతడికి ఎప్పుడూ కోపం రాదు. అనుకోకుండా కోపంతో ఊగిపోయిన సందర్భం ఇండియన్ ప్రిమీయర్ లీగ్ -2022లో చోటు చేసుకుంది.
గుజరాత్ టైటాన్స్ పై చివరి దాకా గెలుస్తుందని అనుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మార్కో జాన్సెన్ చెత్త బౌలింగ్ ప్రదర్శన కారణంగా ఓటమి పాలైంది. ఆఖరి 20వ ఓవర్ లో ఏకంగా 25 రన్స్ ఇచ్చాడు.
ఫస్ట్ బాల్ ను రాహుల్ తెవాటియా సిక్స్ కొట్టాడు. రెండో బాల్ కు సింగిల్ తీసుకున్నాడు. మూడో బంతికి సిక్స్ , నాలుగో బంతి డాట్ బాల్ వేశాడు. ఆ తర్వాతి ఐదు, ఆరో బాల్స్ వరుసగా సిక్స్ లతో హోరెత్తించాడు ఆఫ్గనిస్తాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్.
దీంతో హైదరాబాద్ జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు. గెలవదని అనుకున్న మ్యాచ్ ను విజయాన్ని చేకూర్చి పెట్టాడు. ఇదిలా ఉండగా సన్ రైజర్స్ బౌలింగ్ కోచ్ గా ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan) ఉన్నాడు.
ఇప్పటి వరకు బౌలింగ్ లో దుమ్ము రేపుతూ విజయాలు సాధిస్తూ వస్తోంది హైదరాబాద్ . కానీ ఉన్నట్టుండి నిన్నటి మ్యాచ్ లో మార్కో దెబ్బకు ఠారెత్తింది . స్టాండ్స్ లో ఉన్న మురళీధరన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కీలక దశలో ఫుల్ లెంగ్త్ బాల్స్ వేయడం ఏంటి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మైండ్ దొబ్బిందా అంటూ నిప్పులు చెరిగాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : ఉమ్రాన్ మాలిక్ మెరిసినా తప్పని ఓటమి