Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. ఆమె అద్భుతమైన ప్రసంగం లక్షలాది మందిని ప్రభావితం చేసింది. ప్రసిద్ద ప్రపంచ సంస్థ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా అతిషిని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ప్రశంసల జల్లులు కురిపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ పాలనా నమూనాను అతిషి హైలెట్ చేశారు. పట్టణ పాలనలోని అనేక రంగాలలో పరిష్కారాల కోసం ప్రపంచం ఢిల్లీ వైపు చూస్తోందని పేర్కొన్నారు సీఎం.
ఆక్స్ ఫర్డ్ గ్రాడ్యుయేట్ అయిన అతిషి తన ప్రసంగంలో ఆప్ పాలనా తీరు తెన్నుల గురించి, ఢిల్లీ సర్కార్ తీసుకున్న నిర్ణయాల గురించి ఆమె కూలంకుశంగా వివరించారు.
భారత దేశానికే ఇప్పుడు ఆమ్ పాలనా నమూనా ఒక మార్గదర్శకంగా, స్పూర్తి దాయకంగా నిలిచింది. ఢిల్లీ, ఆప్ భారతీయులను గర్వించేలా చేస్తున్నాయి. పట్టణ పాలనలోని అనేక రంగాలలో పరిష్కారాల కోసం ప్రపంచం ఇప్పుడు ఢిల్లీ వైపు చూస్తోందన్నారు.
ప్రపంచాన్ని మరింత మెరుగైన ప్రదేశంగా మార్చేందుకు మనందరం ఒకరి నుంచి మరొకరం నెర్చుకుంటామని ఇది అతిషి విషయంలో రూఢీ అయ్యిందని స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).
ఆప్ కన్వీనర్ గా ఉన్న సీఎం కేజ్రీవాల్ ఈ సందర్భంఆ అతిషి చేసిన ప్రయత్నాన్ని ప్రత్యేకంగా అభినందించారు సీఎం.
అంతర్జాతీయ వేదికపై ఢిల్లీ ప్రజల మనోభావాలు, జాతితో సహా దేశం సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియ చేసినందుకు అభినందనలు. దేశం ఇటువంటి ప్రగతి శీల ఆలోచనను కోరుకుంటుందన్నారు సీఎం.
Also Read : కమల్ నాథ్ పై బీజేపీ కామెంట్స్