PBKS vs LSG : ఐపీఎల్ 2022 రిచ్ టోర్నీలో భాగంగా జరిగిన కీలక మ్యాచ్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పంజాబ్ కింగ్స్ , లక్నో సూపర్ జెయింట్స్ (PBKS vs LSG)మధ్య మ్యాచ్ జరిగింది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ టాస్ గెలిచి ముందుగా లక్నోకు బ్యాటింగ్ ఇచ్చాడు.
దీంతో భారీ స్కోర్ చేస్తుందని ఆశించిన లక్నో ను కోలుకోలేని రీతిలో దెబ్బ కొట్టారు పంజాబ్ బౌలర్లు. గత సీజన్ లోనే కాదు ఈ సీజన్ లో సత్తా చాటుతున్నాడు లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్. కానీ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చేతులెత్తేశాడు.
కేవలం 6 పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్(PBKS vs LSG) ను గట్టున చేర్చే బాధ్యతను భుజాన వేసుకున్నారు క్వింటన్ డికాక్ , దీపక్ హూడా. వీరిద్దరూ ఎలాంటి తొట్రుపాటుకు లోన కాలేదు.
పరిస్థితిని చేయి దాటి పోకుండా చూసుకున్నారు. ఇదిలా ఉండగా డీకాక్ 46 రన్స్ చేసి సత్తా చాటితే హుడా 34 పరుగులతో మెరిశాడు. 13వ ఓవర్ లో ఊహించని బంతికి డికాక్ అవుటయ్యాడు.
సందీప్ శర్మ కళ్లు చెదిరే బంతులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్ లోనే మరో కీలక వికెట్ ను కోల్పోయింది లక్నో. బెయిర్ స్టో హుడాను రనౌట్ చేశాడు.
ఆ తర్వాత వరుసగా కృనాల్ పాండ్యా 7 పరుగులు చేస్తే , ఆయుష్ బదోనీ 4, మార్కస్ స్టోయినిస్ ఒకే ఒక్క పరుగుతో నిరాశ పరిచారు. ఆఖరున వచ్చిన జేసన్ హోల్డర్ 11 పరుగులు చేయడంతో మొత్తంగా లక్నో 154 పరుగుల టార్గెట్ విధించింది.
Also Read : ఆ ఇద్దరి సపోర్ట్ వల్లే ఆడా – తెవాటియా