Krunal Pandya : ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్ తో జరిగిన లక్నో సూపర్ జెయింట్స్ 20 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటి వరకు 14 సీజన్లు ముగిశాయి. ఇది ముచ్చటగా 15వ సీజన్ నడుస్తోంది.
ఇప్పటికే సగం మ్యాచ్ లు ముగిశాయి. యువ క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. సీనియర్లు దుమ్ము రేపుతున్నారు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
క్రీజులోకి వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ ఆరంభంలోనే కెప్టెన్ కేఎల్ రాహుల్ వికెట్ ను కోల్పోయింది. 153 పరుగులకే కట్టడి చేసింది. క్వింటన్ డికాక్ , దీపక్ హుడా రాణించడంతో ఆ జట్టు ఆ మాత్రం స్కోర్ చేసింది.
ఈ తరుణంలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ సులభంగా గెలుస్తుందని అనుకున్నారు. కానీ లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు సమిష్టిగా రాణించారు. తమ సత్తా చాటారు.
అద్భుతమైన బంతులు వేస్తూ పరుగులు చేయకుండా కట్టడి చేశారు పంజాబ్ ను . దాంతో గెలిచే మ్యాచ్ ను చేజేతులారా పోగొట్టుకుంది. ప్రధానంగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కృనాల్ పాండ్యా (Krunal Pandya)అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
4 ఓవర్లు వేసిన కృనాల్ పాండ్యా 11 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. ఈ నాలుగు ఓవర్లలో ఒక ఓవర్ మెయిడెన్ ఓవర్ ఉండడం విశేషం. పాండ్యాతో పాటు మొహసిన్ 4 ఓవర్లు వేసి 24 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.
చమీరా 4 ఓవర్లు వేసి 17 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. రవి బిష్ణోయ్ ఒక్కడే ఎక్కువ పరుగులు ఇచ్చాడు. 4 ఓవర్లు వేసి 41 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు.
Also Read : ఆ ఇద్దరి సపోర్ట్ వల్లే ఆడా – తెవాటియా