Punjab Kings : పంజాబ్ కింగ్స్ స‌మిష్టి వైఫ‌ల్యం

గెలిచే మ్యాచ్ ఓడి పోయారు

Punjab Kings  : చేతిలోకి వ‌చ్చిన మ్యాచ్ ను పారేసుకుంది పంజాబ్ కింగ్స్ . ఐపీఎల్ 2022 టోర్నీలో పంజాబ్ కింగ్స్ , ల‌క్నో సూయింట్ జెయింట్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది.

ఇందులో 20 ర‌న్స్ తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది ల‌క్నో. పంజాబ్ బౌలింగ్ ప‌రంగా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసింది. కానీ బ్యాటింగ్ ప‌రంగా చేతులెత్తేసింది.

ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును త‌క్కువ స్కోర్ కే క‌ట్ట‌డి చేసింది. 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 153 ర‌న్స్ చేసింది. ఇక త‌మ ముందు అత్య‌ల్ప స్కోర్. పంజాబ్ కింగ్స్(Punjab Kings )అభిమానులు మాత్రం త‌మ జ‌ట్టు గెల‌వ‌డం ఖాయ‌మ‌ని అనుకున్నారు.

మైదానంలోకి టార్గెట్ ను ఛేదించేందుకు దిగిన పంజాబ్ కింగ్స్(Punjab Kings )ఆశించిన రీతిలో రాణించ లేక పోయింది. గ‌త మ్యాచ్ లో త‌న అద్భుత‌మైన ఆట‌తీరుతో ఆక‌ట్టుకున్న వెట‌ర‌న్ ఇండియ‌న్ క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ ల‌క్నో మ్యాచ్ లో చేతులెత్తేశాడు.

ల‌క్నో బౌల‌ర్లు చివ‌రి దాకా త‌మ నైపుణ్యంతో క‌ట్ట‌డి చేశారు. మొద‌ట్లోనే ధాటిగా ఆడిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మ‌యాంక్ అగ‌ర్వాల్ 17 బంతులు ఆడి 25 ర‌న్స్ చేశాడు. 2 ఫోర్లు 2 సిక్స్ లు కొట్టాడు.

దుశ్యంత్ చ‌మీరా బౌలింగ్ లో సిక్స్ కొట్టిన మ‌యాంక్ ఆ వెంట‌నే పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. ఆ వెంట‌నే శిఖ‌ర్ ధావ‌న్ 5 ర‌న్స్ చేస్తే రాజ‌ప‌క్స 9 ప‌రుగుల‌కే వెనుదిరిగారు.

బెయిర్ స్ఓ , లివింగ్ స్టోన్ క్రీజులు ఉన్నంత సేపు పంజాబ్ కింగ్స్ గెలుస్తుంద‌ని అనుకున్నారు. మొహిసిన్ బౌలింగ్ లో అవుట‌య్యాడు. జితేశ్ శ‌ర్మ 2 ర‌న్స్ చేసి వెనుదిరిగితే ఆఖ‌రులో వ‌చ్చిన రిషి ధావ‌న్ 21 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.

Also Read : బెన్ స్టోక్స్ కు జో రూట్ అభినంద‌న

Leave A Reply

Your Email Id will not be published!