GT vs RCB IPL 2022 : బెంగళూరు వర్సెస్ గుజరాత్ బిగ్ ఫైట్
వరుస విజయాలలో టైటాన్స్ పాయింట్లలో టాప్
GT vs RCB : ఐపీఎల్ 2022లో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ముంబై లోని సీసీఐ స్టేడియంలో వరుస విజయాలతో జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(GT vs RCB) పోటీ పడనుంది.
మరో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ మధ్య రసవత్తర పోరు కొనసాగనుంది. ఇక గుజరాత్ విషయానికొస్తే ఇప్పటి వరకు ఆ జట్టు ఎనిమిది మ్యాచ్ లు ఆడింది.
కేవలం ఒకే ఒక్క మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఓడి పోయింది. ఇక బెంగళూరు విషయానికి వస్తే ఇప్పటి వరకు ఆ జట్టు 9 మ్యాచ్ లు ఆడింది. 5 మ్యాచ్ లలో గెలిచి 4 మ్యాచ్ లలో ఓటమి పాలైంది.
ఇక జట్ల విషయానికి వస్తే గుజరాత్ టైటాల్స్ లో మాథ్యూ వేడ్ , జోసఫ్ , జేసన్ రాయ్ , జయంత్ యాదవ్ , డొమినిక్ గ్రేక్స్ , గురు కీరత్ సింగ్ , నూర్ అహ్మద్ , ప్రదీప్ సాంగ్వాన్ , సాయి సుదర్శన్ , సదరంగని,
డేవిడ్ మిల్లర్ , హార్దిక్ పాండ్యా ( కెప్టెన్ ) షమీ, రషీద్ ఖాన్ , విజయ్ శంకర్ , సాహా, దర్శన్ నాల్కేండే ఆడతారు. యశ్ దయాల్ , సాయి కిషోర్ , లూకీ ఫెర్యూ సన్ , శుభ్ మన్ గిల్ , రాహుల్ తెవాతియా, వరుణ్ ఆరోన్ ఉన్నారు.
రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు జట్టుకు డుప్లెసిస్ కెప్టెన్. ఇక జట్టులో విరాట్ కోహ్లీ, రూథర్ ఫోర్డ్ , లువ్నిత్ సిసోడియా, గ్లెన్ మాక్స్ వెల్
, వానిందు హసరంగా, అనీశ్వర్ గౌతమ్ , సిద్దార్త్ కౌల్ , జోష్ హాజల్ వుడ్ ఆడతారు. దినేశ్ కార్తీక్ , మహిపాల్ లామ్రోర్ , అనుజ్ రావత్ , డేవిడ్ విల్లీ,
ఫిన్ అలెన్ , కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్ , జాసన్ బెహ్రిండోర్స్ , చామ వి మిలింద్ , ప్రభు దేశాయ్, షాబాద్ అహ్మద్ , హర్షల్ పటేల్ , ఆకాశ్ దీప్ ఉన్నారు.
Also Read : పీసీబీలో ప్రాధాన్యతలు మారాలి – మిస్బా