NV Ramana : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(NV Ramana) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్ కుమార్ పై సీరియస్ అయ్యారు.
శనివారం ఢిల్లీలో సుదీర్ఘ కాలం తర్వాత దేశంలోని ముఖ్యమంత్రులు, హైకోర్టు చీఫ్ జస్టిస్ లు, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ లతో సదస్సు జరిగింది.
దీనికి ముఖ్య అతిథులుగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ, సీజేఐ జస్టిస్ నూతలపాటి వెంకట రమణతో పాటు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, భారత దేశ అటార్నీ జనరల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ ప్రసంగించారు.
ఆయన ప్రత్యేకించి తెలంగాణ సీఎస్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. సీఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని న్యాయ వ్యవస్థ సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ , సీజే పలు నిర్ణయాలు తీసుకుంటున్నారని కితాబు ఇచ్చారు.
కాగా వాటిని అమలు చేయకుండా పెండింగ్ లో ఉంచుతుండడంపై సీఎస్ సోమేష్ కుమార్ పై మండిపడ్డారు. తమ వ్యక్తిగత పనుల కోసం అడగడం లేదన్నారు.
ఇదే సమయంలో న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకే నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. జిల్లా కోర్టుల్లో ఒక న్యాయవాది లోపలకు వెళ్లి వస్తే తప్పా మరొకరు వెళ్లలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం సీజేఐ చేసిన ఈ కామెంట్స్ తెలంగాణ ప్రభుత్వంలో కాకా రేపుతున్నాయి.
Also Read : కేంద్ర మంత్రికి కేటీఆర్ కౌంటర్