Jos Butler : ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో ఒకే ఒక్కడి పేరు మారుమ్రోగుతోంది. అతడు ఎవరో కాదు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వరల్డ్ స్టార్ హిట్టర్, ఇంగ్లండ్ ప్లేయర్ జోస్ బట్లర్.
ఎలాంటి బంతులైనా సరే, ప్రత్యర్థులు ఎవరైనా సరే బాదడం మాత్రం ఆపడం లేదు. తన అటాకింగ్ ను కొనసాగిస్తూ వస్తున్నాడు.
ప్రతి జట్టు ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ తరపున బట్లర్ ను ఎంత త్వరగా ఔట్ చేస్తే సులభంగా గెలవచ్చని ఆలోచిస్తున్నారంటే అతడు ఎంత ప్రమాదకరంగా తయారయ్యాడో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా ముంబై వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో మళ్లీ మెరిశాడు జోస్ బట్లర్(Jos Butler). ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా తను మాత్రం సహజ సిద్దమైన ఆట తీరును ప్రదర్శించాడు.
ఇప్పటి వరకు ఐపీఎల్ లో మూడు సెంచరీల మోత మోగించాడు. అంతే కాదు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ముంబైకి వ్యతిరేకంగా 67 పరుగులు చేశాడు.
జట్టు మొత్తం కలిపి 158 పరుగులు చేస్తే మనోడివే సగం ఉన్నాయి. ఇక టోర్నీలో భాగంగా అత్యధిక పరుగులు చేసే బ్యాటర్లకు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ అవార్డు రేసులో ఎవరూ అందనంత ఎత్తులో ఉన్నాడు జోస్ బట్లర్.
ఏకంగా 570 పరుగుల దాకా వచ్చాడు. రెండో ప్లేస్ లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఉన్నాడు. ఇక ఇదే జోరు కొనసాగిస్తే రాబోయే కీలక లీగ్ మ్యాచ్ లలో ఇంకెన్ని పరుగులు చేస్తాడో చెప్పలేం.
Also Read : ఉమ్రాన్ మాలిక్ అత్యుత్తమ బౌలర్ – గంగూలీ