Irfan Pathan : ఐపీఎల్ 2022లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. యువ ఆటగాళ్లు దుమ్ము రేపుతుంటే సీనియర్లు దంచి కొడుతున్నారు.
ఇక ఐపీఎల్ రిచ్ లీగ్ లో అత్యధికంగా టైటిళ్లు గెలుచుకున్న జట్లు చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ ఉన్నాయి. కాగా గత సీజన్ లో జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని సీఎస్కే టీం కు టైటిల్ తీసుకు వచ్చాడు.
ఇదే సమయంలో ఈసారి ఐపీఎల్ ప్రారంభం కంటే ముందే తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు ధోనీ. కాగా ఇప్పటి వరకు 8 మ్యాచ్ లు ఆడి వరుసగా ఆరు మ్యాచ్ లలో ఓటమి పాలైంది.
2 మ్యాచ్ లలో గెలుపొందింది. ప్లే ఆఫ్స్ ఆశలు సన్నగిల్లాయి. కాగా ధోనీ స్థానంలో రవీంద్ర జడేజాకు అప్పగించింది చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్ మెంట్.
దాంతో తాను నాయకత్వం వహించలేనంటూ సంచలన ప్రకటన చేశాడు రవీంద్ర జడేజా. తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.
దీనిని అధికారికంగా ధ్రువీకరించింది సీఎస్కే యాజమాన్యం. మళ్లీ ధోనీకే పగ్గాలు ఇస్తున్నట్లు డిక్లేర్ చేసింది. ఈ తరుణంలో రవీంద్ర జడేజా ఆట తీరుపై ప్రభావం ఏమీ ఉండదన్నాడు భారత మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan).
ఇక నుంచి అటు బ్యాటర్ గా ఇటు బౌలర్ గా రాణించే అవకాశం ఉందన్నాడు పఠాన్. ఆట పరంగా చూస్తే జడేజా సూపర్ ప్లేయర్. నాయకత్వ ఒత్తిడిని తట్టుకోలేక పోయాడని పేర్కొన్నాడు.
Also Read : చెన్నై వర్సెస్ హైదరాబాద్ బిగ్ ఫైట్