CJI NV Ramana : పెండింగ్ లో 40 మిలియ‌న్ల కేసులు – సీజేఐ

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ఎన్వీ ర‌మ‌ణ

CJI NV Ramana : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో పేరుకు పోయిన కేసుల ప‌రిష్కారం గురించి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

ఇప్ప‌టి దాకా దేశ వ్యాప్తంగా ఆయా కోర్టుల‌లో ఖాళీలు వేలాదిగా ఉన్నాయ‌ని, మౌలిక వ‌స‌తుల లేమితో కొట్టు మిట్టాడుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప‌నిలో ప‌నిగా నిధులు మంజూరు చేసినా ఈరోజు వ‌ర‌కు ఆయా రాష్ట్రాల‌లో ప‌నులు న‌త్త న‌డ‌క‌న న‌డుస్తున్నాయ‌ని ఆరోపించారు. ఇదే స‌మ‌యంలో తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ పై నిప్పులు చెరిగారు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌(CJI NV Ramana).

సీఎం, హైకోర్టు సీజే సానుకూలంగా ఉన్న‌ప్ప‌టికీ సీఎస్ క‌క్ష సాధింపు ధోర‌ణితో ఉండ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ప్ర‌స్తుతం సీజేఐ చేసిన వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపాయి. దీనిపై రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి కూడా స్పందించాల్సి వ‌చ్చింది.

ఇదే స‌మయంలో ఇప్ప‌టి దాకా దేశ వ్యాప్తంగా 40 మిలియ‌న్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయ‌ని జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట‌ర‌మ‌ణ చెప్పారు. న్యాయ స్థానాలు త‌మ స‌మ‌ర్థ ప‌నితీరుకు కీల‌క‌మైన న్యాయ‌మూర్తుల కొర‌త‌ను ఎదుర్కొంటున్నాయ‌ని తెలిపారు.

ఆయా ఉన్న‌త సంస్థ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం అన్న‌ది ఉండాల‌ని సూచించారు. ఇదే స‌మ‌యంలో ల‌క్ష్మ‌ణ రేఖ కూడా ఒక‌టి ఉంద‌న్న‌ది గుర్తు పెట్టుకోవాల‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

ఇప్ప‌టికైనా కేంద్రం , రాష్ట్ర ప్ర‌భుత్వాలు త్వ‌రిత‌గ‌తిన మౌలిక స‌దుపాయాలు, ఖాళీల భ‌ర్తీకి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.
ప్ర‌తి మిలియ‌న్ జ‌నాభాకు 20 మంది న్యాయ‌మూర్తులు ఉన్నార‌ని ఇది స‌రిపోద‌న్నారు సీజేఐ.

Also Read : పాటియాలా కేసులో బ‌ర్జింద‌ర్ ప‌ర్వానా అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!