Anjelina Jolie : యావత్ ప్రపంచం నెత్తి నోరు మొత్తుకున్నా, యుద్దం ఆపమని కోరినా ఈరోజు వరకు రష్యా వెనక్కి తగ్గింది లేదు. పైపెచ్చు ఇంకా దాడులకు పాల్పడుతూ సాగుతోంది. వరుస బాంబు దాడులతో ఉక్రెయిన్ వల్లకాడును తలపింప చేస్తోంది.
వేలాది మంది చని పోయారు. ఆస్తి నష్టం సంభవించింది. లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. చిన్నారులు, మహిళలు , వృద్దుల పరిస్థితి దయనీయంగా ఉంది ఉక్రెయిన్ లో. ఐక్య రాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ ఆ దేశాన్ని సందర్శించారు.
తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన ఫ్యామిలీని కోల్పోయినంత బాధగా ఉందన్నారు. దీనిని అరికట్టడంలో సెక్యూరిటీ కౌన్సిల్ విఫలమైందని ఆరోపించారు.
ఇటలీ ప్రిన్స్ ఉక్రెయిన్ కు సాయం చేసింది. ఈ యుద్దంలో విజయం కంటే ముందు ప్రాణ నష్టం జరగకుండా చూడాలని కోరింది. ఇదిలా ఉండగా హాలీవుడ్ దిగ్గజ నటి ఏంజెలినా జోలి (Anjelina Jolie )ఆదివారం ఉక్రెయిన్ లో పర్యటించారు.
బాధితులను పరామర్శించారు. ఆమె వారికి భరోసా కల్పించేందుకు ప్రయత్నం చేశారు. ఎక్కడ చూసినా బాధితులే. కదిలిస్తే కన్నీళ్లే. ప్రధానంగా చిన్నారులతో ముచ్చటించింది.
ఐక్య రాజ్య సమితి శరణార్థుల ఏజెన్సీ ప్రత్యేక ప్రతినిధిగా ఆమె పర్యటించింది. ఈ సందర్బంగా బాధితుల పరిస్థితి గురించి ఆరా తీశారు.
ఈ సందర్బంగా యుద్దాన్ని వెంటనే ఆపాలని కోరింది. సైనిక చర్య పేరుతో మరణ హోమానికి పాల్పడే హక్కు ఎవరికీ లేదన్నారు.
శాంతి , సామరస్యం, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. ఇది అత్యంత అమానవీయ చర్యగా అభివర్ణించారు.
Also Read : బాలీవుడ్ స్టార్స్ అభద్రతలో ఉన్నారు -ఆర్జీవి