Patiala Clashes : పాటియాలా కేసులో బర్జిందర్ పర్వానా అరెస్ట్
ఘర్షణల్లో ప్రధాన నిందితుడిగా కేసు నమోదు
Patiala Clashes : పంజాబ్ లోని పాటియాలాలో ఇటీవల చోటు చేసుకున్న ఘర్షణల్లో కీలక నిందితుడగా భావిస్తున్న బర్దిందర్ సింగ్ పర్వానాను పోలీసులు అరెస్ట్ చేశారు. గత శుక్రవారం ఖలిస్తాన్ వ్యతిరేక మార్చ్ పై రెండు గ్రూపులు ఘర్షణకు దిగాయి.
ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వారు. కత్తులు దూసుకుననారు. పరిస్థితి అదుపులోకి తీసుకు వచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘర్షణల్లో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఇందుకు బాధ్యులైన వారిని ప్రభుత్వం ముగ్గురిని బదిలీ చేసింది. సమగ్ర విచారణకు ఆదేశించింది. ఇది మత పరమైన ఘర్షణ కాదని రాజకీయ వర్గాల ఘర్షణ అని సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు.
ఇందులో శివసేన, భారతీయ జనతా పార్టీ, శిరోమణి అకాలీదళ్ ఉన్నాయి. బర్దిందర్ సింగ్ పర్వానా తో పాటు ఇంకొందరి నిందితులను పాటియాలా(Patiala Clashes ) లోని కోర్టు ముందు హాజరు పరుస్తామని పోలీసులు ఆదివారం వెల్లడించారు.
ఇదిలా ఉండగా పాటియాలాలో మీడియాతో మాట్లాడారు ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (పాటియాలా రేంజ్ ) ముఖ్విందర్ సింగ్ చినా. ప్రధాన నిందితుడైన బర్దిందర్ సింగ్ పర్వానాను మొహాలీలో అరెస్ట్ చేశామన్నారు.
తదుపరి విచారణ కోసం పర్వానాను కోర్టు ముందు హాజరు పరుస్తామని చెప్పారు. జిల్లాలోని రాజ్ పురాకు చెందిన పర్వానా ఆనాటి ఘటనలో కీలక పాత్ర ధారి అని తెలిపారు.
అతడితో పాటు హరీస్ సింగ్లా సహచరుడైన శంకర్ భరద్వాజ్, జగ్గీ పండిట్ ను కూడా అరెస్ట్ చేశామన్నారు చన్నీ.
Also Read : దేశానికి రెండో ఫ్రంట్ అవసరం – పీకే