CSK vs SRH : ఐపీఎల్ 2022లో భాగంగా సమ ఉజ్జీల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ చివరి దాకా ఉత్కంఠ భరితంగా సాగింది. నువ్వా నేనా అన్న రీతిలో ఆట నడిచింది. చివరకు మరోసారి జట్టుకు పగ్గాలు చేపట్టిన ఎంఎస్ ధోనీ నేతృత్వంలో సీఎస్కే విజయం సాధించింది.
ఇక టాస్ గెలిచన సన్ రైజర్స్ కె్ప్టెన్ కేన్ విలియమ్సన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక టాస్ ఓడి క్రీజులోకి
ఎంటరైన సీఎస్కే ఆటగాళ్లు హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. రుతురాజ్ గైక్వాడ్ 99 పరుగులు చేసి కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు.
మరో స్టార్ ప్లేయర్ డేవాన్ కాన్వే 85 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.
ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం టార్గెట్ ఛేదించేందుకు మైదానంలోకి దిగింది సన్ రైజర్స్ హైదరాబాద్(CSK vs SRH ). అభిషేక్ శర్మ 39 పరుగులు చేస్తే
కెప్టెన్ విలియమ్సన్ 47 పరుగులు చేసి తమ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు.
ఇదే సమయంలో మంచి పటిష్టమైన స్థితికి చేరుకుంది. ఆఖరి వరకు తీసుకు వచ్చింది.
కానీ ఉన్నట్టుండి చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ ముకేష్ చౌదరి వచ్చీ రావడంతోనే దెబ్బ కొట్టాడు.
రాహుల్ త్రిపాఠి డకౌట్ గా వెనుదిరిగాడు. వాషింగ్టన్ సుందర్ 2 పరుగులకే, శశాంక్ సింగ్ 15 పరుగులకే చాప చుట్టేవారు. ఈ సమయంలో ఎయిడెన్ 17 రన్స్ చేస్తే ఆఖరున వచ్చిన నికోలస్ పూర్ దంచి కొట్టాడు.
64 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. కానీ దీంతో హైదరాబాద్ 14 పరుగుల తేడాతో ఓడి పోయింది. 20 ఓవర్లలో 189 రన్స్ మాత్రమే చేసింది. దీంతో సీఎస్కే మూడో విజయాన్ని నమోదు చేసింది.
Also Read : మెరిడిత్ బౌన్సర్ తప్పించుకున్న బట్లర్