Ruturaj Gaikwad : ఐపీఎల్ లో నిన్నటి దాకా పేలవమైన ఆట తీరుతో నిరాశ పరిచిన ఈ జట్టేనా ఆడుతున్నది అన్నంత అద్భుతంగా ఆడింది. లీగ్ మ్యాచ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబద్ తో జరిగిన మ్యాచ్ చివరి దాకా ఉత్కంఠను రేపింది.
ముందుగా బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. ప్రధానంగా రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad )కళ్లు చెదిరే షాట్స్ తో ఆడాడు. కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్సయ్యాడు.
99 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఇప్పటి వరకు బ్యాటర్ల పాలిట సింహ స్వప్నంగా ఉంటూ వచ్చిన జమ్మూ కాశ్మీర్ స్టార్ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కు చుక్కలు చూపించాడు రుతురాజ్ గైక్వాడ్ .
అతడికి చుక్కలు చూపించాడు. మాలిక్ తో పాటు ఇతర బౌలర్లను వదిలి పెట్టలేదు గైక్వాడ్. మళ్లీ ఫామ్ లోకి రావడంతో స్టన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రకాశవంతమైన నక్షత్రం లాగా మెరిశాడు.
25 ఏళ్ల బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో ఏకంగా 3 సిక్సర్లు ఒక ఫోర్ ను బాదాడు. దీంతో స్టేడియం లోని ఫ్యాన్స్ అంతా రుతురాజ్ కు జేజేలు పలికేలా చేసింది.
ఓ వైపు ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ఇంకో వైపు చాన్స్ దొరికినప్పుడు సింగిల్స్ , డబుల్స్ తీస్తూ స్కోర్ పరుగులు తీయించాడు. దీంతో నిర్ణిత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 202 రన్స్ చేసింది.
దీంతో రుతురాజ్ దెబ్బకు ఉమ్రాన్ మాలిక్ విస్తు పోయాడు.
Also Read : చెన్నై వర్సెస్ హైదరాబాద్ బిగ్ ఫైట్