MS Dhoni : రవీంద్ర జడేజా తప్పుకున్న అనంతరం మళ్లీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni )ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రధానంగా టాప్ పేసర్ గా ప్రశంసలు అందుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కు తమ ఆటగాళ్లు చుక్కలు చూపించడం ఆనందంగా ఉందన్నారు.
ఈ మ్యాచ్ లో వాళ్లిద్దరూ అద్భుతంగా ఆడారంటూ కితాబు ఇచ్చారు ధోనీ. రుతురాజ గైక్వాడ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడని, డెవాన్ కాన్వే అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడని మొత్తంగా ఇది సమిష్టి విజయమని పేర్కొన్నాడు సీఎస్కే కెప్టెన్.
కాగా 99 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ ఒకే ఒక్క పరుగు దూరంలో సెంచరీ మిస్ కావడం తనను బాధ కలిగించిందన్నాడు. ఇక డెవాన్ 85 రన్స్ చేయడం, బౌలర్లు చక్కగా లైన్ అండ్ లెన్త్ మిస్ అవకుండా వేయడంతో కట్టడి చేసేందుకు వీలు కలిగిందన్నాడు.
ఇదిలా ఉండగా 9 మ్యాచ్ లు ఆడిన సీఎస్కే మూడు మ్యాచ్ లలో గెలుపొందింది. ఆరు మ్యాచ్ లలో ఓటమి పాలైంది. ఇక ముంబై ఇండియన్స్ 9 మ్యాచ్ లు ఆడి ఒకే ఒక్క మ్యాచ్ లో విజయం సాధించింది.
ఆ జట్టు ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉండగా ఇక నుంచి కంటిన్యూగా అన్ని మ్యాచ్ లలో గెలుపొందితే సీఎస్కే ప్లే ఆఫ్స్ కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. లేక పోతే ఇంటికి వెళ్లాల్సి వస్తుంది.
మొత్తంగా ధోనీ రాకతో చెన్నై శిబిరంలో కొత్త వాతావరణం చోటు చేసుకుంది. ఫ్యాన్స్ తెగ సంబరపడి పోతున్నారు.
Also Read : మిగతా వాళ్ల కంటే పాండ్యా బెటర్