Wasim Jaffer : ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఐపీఎల్ 2022లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. యువ ఆటగాళ్లు దుమ్ము రేపుతుంటే సీనియర్లు సత్తా చాటుతున్నారు.
తామేమిటో నిరూపించు కునేందుకు దీనిని వేదికగా చేసుకున్నారు క్రికెటర్లు. ఇక ఈ ఏడాది లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే టీ20 వరల్డ్ కప్ జరగనుంది.
ఈసారి ఐపీఎల్ లో పెద్ద ఎత్తున ప్లేయర్లు సత్తా చాటుతూ మరింత ఉత్కంఠ కు గురి చేస్తుండడం విశేషం. ప్రస్తుతం ఆసిస్ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ కు సంబంధించి ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ మల్లగుల్లాలు పడుతున్నారు.
ఇదే సమయంలో తాజా, మాజీ ఆటగాళ్లతో పాటు పొలిటికల్ లీడర్లు సైతం పలువురు ఆటగాళ్లను ఎంపిక చేయాలని సూచిస్తుండడం ఈసారి మరో విశేషం.
జమ్మూ కాశ్మీర్ కు చెందిన స్టార పేసర్ ఉమ్రాన్ మాలిక్ ను బీసీసీఐ కచ్చితంగా తీసుకోవాలంటూ కోరారు కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం, ఎంపీ శశి థరూర్ , ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.
ఇదిలా ఉండగా గత ఏడాది తీవ్రంగా నిరాశ పరిచింది టీమిండియా. ఈసారి ఎలా రాణిస్తుందనేది జట్టు ఎంపికపై ఆధార పడి ఉంటుంది.
ఈ తరుణంలో భారత జట్టు మాజీ కోచ్ వసీం జాఫర్(Wasim Jaffer) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తుది జట్టు ఎంపికలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా కు చోటు దక్కడం ఖాయమని జోష్యం చెప్పారు.
Also Read : సీఎస్కే విజయం ఫ్యాన్స్ ఆనందం