NFL NBA STARS : ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న రాజస్థాన్ రాయల్స్
ఎన్ఎఫ్ఎల్ ..ఎన్బీఏ భారీగా ఇన్వెస్ట్ మెంట్
NFL NBA STARS : ప్రపంచాన్ని మెస్మరైజ్ చేస్తోంది ఇండియన్ ప్రిమీయర్ లీగ్. ఏ ముహూర్తాన లలిత్ మోడీ దీనిని స్టార్ట్ చేశాడో కానీ ఇప్పుడు కోట్లాది రూపాయల వర్షం కురిపిస్తోంది. ఒక్క ప్రసార హక్కులు ఐదేళ్లకు రూ. 50,000 కోట్లు రాబడుతోంది బీసీసీఐ.
ఇంతటి భారీ ఆదాయం కలిగిన క్రీడా సంస్థ ప్రపంచంలో ఎక్కడా లేదంటే నమ్మలేం. ఐసీసీ ఉన్నప్పటికీ బీసీసీఐ ఏం చెబితే అదే. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే 14 సీజన్ల వరకు 8 జట్లు ఉండేవి.
ఇప్పుడు 10 జట్లు పాల్గొంటున్నాయి. రాజస్థాన్ రాయల్స్ మేనేజ్ మెంట్ విదేశీ ఇన్వెస్టర్లను, కంపెనీలను ఆకర్షించడం విశేషం. తాజాగా అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీలు ఆర్ఆర్ లో పెట్టుబడులు పెట్టాయి.
ఐపీఎల్ తొలి ఛాంపియన్ గా నిలిచింది రాజస్థాన్ రాయల్స్ . దీనికి దివంగత ఆసిస్ క్రికెటర్ షేన్ వార్న్ నాయకత్వం వహించాడు. ప్రస్తుతం ఈసారి ఐపీఎల్ లో సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ టైటిల్ ఫెవరేట్ గా ఉంది.
తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టులో అమెరికాకు చెందిన నేషనల్ ఫుట్ బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్ ) దిగ్గజం లారీ ఫిట్టెరాల్డ్ , స్టార్ ఆటగాడు బీచుమ్ , నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ( ఎన్ బీ ఏ ) స్టార్ క్రిస్ పాల్ ఇన్వెస్ట్(NFL NBA STARS) చేశారు.
ఈ ముగ్గురు ఆటగాళ్లు తమ స్టేక్ హోల్డర్ల జాబితాలో చేరారని రాజస్థాన్ ఫ్రాంచైజీ వెల్లడించింది. కాగా మనోజ్ బదాలేకు చెందిన ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ దీనికి యజమాని.
Also Read : మిగతా వాళ్ల కంటే పాండ్యా బెటర్