KKR vs RR : ఐపీఎల్ 2022లో భాగంగా ముంబై వేదికగా జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో ఊహించని రీతిలో కోల్ కతా నైట్ రైడర్స్(KKR vs RR) ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ను కేకేఆర్ బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ తో కట్టడి చేశారు. పరుగులు ఇవ్వకుండా బ్యాటర్లకు చుక్కలు చూపించారు.
ఈ దశలో రాజస్థాన్ కేవలం 100 పరుగులు చేస్తుందా అన్న అనుమానం చెలరేగింది. కెప్టెన్ శాంసన్ 54 పరుగులు చేస్తే ఆఖరులో సిమ్రాన్ హిట్ మైర్ 27 రన్స్ చేశాడు.
ఇక మంచి ఊపు మీదున్న స్టార్ హిట్టర్ జోస్ బట్లర్ ఈసారి కేవలం 22 పరుగులే చేసి నిరాశ పరిచాడు. సౌథీ అద్భుతమైన బంతికి బట్లర్ ను బోల్తా కొట్టించాడు.
ఇక నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్(KKR vs RR) 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులకే పరిమితమైంది. దేవదత్ పడిక్కల్ 2 పరుగులు చేస్తే కరుణ్ నాయర్ 13, రియాన్ పరాగ్ 19 రన్స్ మాత్రమే చేశారు.
ఆఖరులో వచ్చిన హిట్ మైర్ కేవలం 13 బంతులు మాత్రమే ఆడి 27 రన్స్ చేస్తే రవిచంద్రన్ అశ్విన్ 6 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో ఉమేష్ యాదవ్ , రాయ్ శివమ్ మావి చెరో వికెట్ తీశారు.
సౌథీ 46 రన్స్ ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ 8 మ్యాచ్ లు ఆడింది ఇందులో 6 మ్యాచ్ లు గెలుపొందింది. 2 మ్యాచ్ లలో ఓటమి పాలైంది.
ఇదిలా ఉండగా ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది.
Also Read : కోల్ కతా గెలిచేనా రాజస్థాన్ నిలిచేనా