RR vs KKR : ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో వరుస పరాజయాలతో తీవ్ర నిరాశలో ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ (RR vs KKR)అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది. రాజస్థాన్ రాయల్స్ కు చుక్కలు చూపించింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.
దీంతో రాజస్థాన్ 9 మ్యాచ్ లు 6 మ్యాచ్ లలో గెలుపొంది 3 మూడు మ్యాచ్ లలో ఓటమి పాలైంది. కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ రాయల్స్ 152 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ ఒక్కడే రాణించాడు. 54 రన్స్ చేసి వెనుదిరిగాడు.
బట్లర 22 రన్స్ చేస్తే ఆఖరున వచ్చిన సిమ్రాన్ హిట్ మైర్ 27 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోర్ చేసింది. ఇక టార్గెట్ ఛేదనలో బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది.
ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ను ముగించింది. శ్రేయస్ అయ్యర్ 34 రన్స్ చేసి రాణించాడు. నితీష్ రాణా మరోసారి దంచి కొట్టాడు. 48 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
కొత్తగా తీసుకున్న రింకూ సింగ్ 42 రన్స్ చేసి నాటౌట్ గా మిగిలాడు. కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ప్రసిద్ధ్ క్రిష్ణ, బౌల్ట్ , కుల్దీప్ సేన్ చెరో వికెట్ తీశాడు.
ఈ మ్యాచ్ లో పూర్తిగా క్రెడిట్ కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లకు ఇవ్వాలి.
Also Read : వాళ్లిద్దరు అద్భుతంగా ఆడారు