Nitish Rana : ర‌ఫ్ఫాడించిన నితీష్ రాణా

జ‌ట్టు గెలుపులో కీల‌క పాత్ర

Nitish Rana : ఐపీఎల్ మెగా టోర్నీలో భాగంగా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండానే విజ‌యం సాధించింది. కేవ‌లం 3 వికెట్లు కోల్పోయింది.

153 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కేకేఆర్ టీంలో మ‌రోసారి త‌న జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు నితీష్ రాణా(Nitish Rana). కీల‌క‌మైన 48 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.

ఈ త‌రుణంలో ఎవ‌రీ నితీష్ రాణా అన్న‌ది ప్ర‌శ్న ఉద‌యించ‌డం ఖాయం. 27 డిసెంబ‌ర్ 1993లో పుట్టాడు. ఇప్పుడు రాణాకు 28 ఏళ్లు. ఎడ‌మ చేతి బ్యాట‌ర్. 23 జూలై 2021లో శ్రీ‌లంక‌తో వ‌న్డే ఫార్మాట్ లో అరంగేట్రం చేశాడు.

28 జూలై ఇదే ఏడాదిలో లంక‌తో టీ20 లో ఎంట్రీ ఇచ్చాడు రాణా. 2011 నుంచి ఢిల్లీ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. 2015 నుంచి 2017 దాకా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు త‌ర‌పున ఆడాడు.

2018 నుంచి కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కు ఆడుతున్నాడు. రాజ్ పుత్ కుటుంబంలో దారా సింగ్ రాణా, స‌తీష్ రాణా దంప‌తుల‌కు పుట్టాడు. బ్యాట‌ర్ గానే కాదు పార్ట్ టైమ్ స్పిన్నర్ గా రాణిస్తున్నాడు.

2018లో గౌత‌మ్ గంభీర్ స్థానంలో ఢిల్లీకి కెప్టెన్ గా ఎంపిక‌య్యాడు. స్టార్ హిట్ట‌ర్ గా పేరొందాడు. 2015-16లో జ‌రిగిన స‌య్య‌ద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో 21 సిక్స‌ర్లు కొట్టాడు.

రాణాను తీర్చి దిద్ద‌డంలో రికీ పాంటింగ్ ట్రై చేశాడు. ఒక ర‌కంగా జ‌ట్టుకు కీల‌కంగా మారాడు రాణా.

Also Read : సీఎస్కే విజ‌యం ఫ్యాన్స్ ఆనందం

Leave A Reply

Your Email Id will not be published!