Jignesh Mevani : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని గుజరాత్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు అస్సాం పోలీసులు. ఆపై మహిళా కానిస్టేబుల్ ను దూషించి, దాడికి పాల్పడ్డాడంటూ మరో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
దీనిని సవాల్ చేస్తూ జిగ్నేష్ మేవానీ(Jignesh Mevani) తరపున బెయిల్ మంజూరు కోసం దరఖాస్తు చేశారు. దీనిపై పరిశిలీంచిన కోర్టు మేవానీకి బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేసింది.
రాష్ట్రంలో పోలీసు స్టేట్ నడుస్తోందా అంటూ మండిపడింది. తప్పుడు ఎఫ్ఐఆర్ ఎలా రాస్తారాంటూ ప్రశ్నించింది. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధిపై ఇలాగేనా నమోదు చేసిది అంటూ నిలదీసింది.
పోలీసుల తీరు దారుణంగా ఉందంటూ పేర్కొంది. పరిమితులు దాటి ప్రవర్తించారంటూ మండిపడింది. హైకోర్టు బార్ పేట పోలీస్ స్టేషన్ లో దాఖలైన కేసులో జిగ్నేష్ మేవానీకి బార్ పేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఈ సందర్భంగా జారీ చేసిన ఉత్తర్వులలో కీలక వ్యాఖ్యలు చేసింది. పరిమితులు దాటి పోలీసు యంత్రాగం, ప్రభుత్వం అత్యుత్సాహాన్ని ప్రదర్శించిందంటూ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
బార్పేట జిల్లా, సెషన్స్ జడ్జి అపరేష్ చక్రవర్తి చేసిన పరిశీలనను సవాల్ చేస్తూ అస్సాం ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన జస్టిస్ దేబాషిస బారువా జిగ్నేష్ మేవానీ (Jignesh Mevani) పట్ల పోలీసులు, ప్రభుత్వం అనుసరించింది తప్పు అని తేల్చి పారేశారు.
తనపై తప్పుడు కేసు నమోదైందని కోర్టు ద్వారా నిరూపితమైందన్న విషయం ప్రజలకు తెలుసన్నారు ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ.
Also Read : ప్రశాంత్ కిషోర్ కు సిద్దూ కంగ్రాట్స్