Modi : గత ఏడాది 2021లో గ్లోబల్ (ప్రపంచ) రియల్ టైమ్ చెల్లింపుల్లో 40 శాతం ఒక్క భారత దేశంలోనే జరిగాయని చెప్పారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. యూరప్ లో పర్యటిస్తున్న ప్రధాని జర్మనీలో భారతీయ కమ్యూనిటీని ఉద్దేశించి ప్రసంగించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని , వినియోగాన్ని సుపరిపాలనతో అనుసంధానించడం లో తమ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ఈ సందర్భంగా సర్కార్ సాధించిన ఘనతను వివరించారు.
అంతే కాకుండా దేశంలో రికార్డు స్థాయిలో విమానాశ్రయాల నిర్మాణం జరుగుతోందని చెప్పారు నరేంద్ర మోదీ(Modi ). ప్రపంచ వ్యాప్తంగా జరిగిన మొత్తం రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 40 శాతానికి మించి ఇండియాలోనే జరిగాయని వెల్లడించారు.
ఇది భారత్ సాధించిన సాంకేతిక ప్రగతి వినియోగానికి నిదర్శనమని పేర్కొన్నారు. పాలనలో మొదటిసారిగా సాంకేతికతను ఎక్కువగా ఉపయోగించిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
దీని వల్ల కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగినట్లయిందని చెప్పారు మోదీ. ఒక రకంగా చెప్పాలంటే లావాదేవీల పరంగా సమయం వృధా కావడం లేదన్నారు.
టెక్నాలజీ రోజు రోజుకు మారుతూ వస్తోంది. దీనిని ఎక్కువగా ఉపయోగించు కుంటున్నది మాత్రం తామేనని చెప్పారు ప్రధానమంత్రి.
ఈ సందర్భంగా ప్రతిపాక్షాలపై విరుచుకు పడ్డారు. ప్రధానంగా ఆయన మరోసారి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. ఇదే సమయంలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అనేక సేవలను ఆన్ లైన్ లో ఉంచామన్నారు.
దీని వల్ల ప్రజలకు మెరుగైన సేవలు లభించాయన్నారు. ఉపకార వేతనాలతో పాటు రైతులకు చెల్లింపులు అన్నీ నేరుగా బ్యాంకు ఖాతాలకు బదిలీ అవుతున్నాయని చెప్పారు మోదీ.
Also Read : పోర్న్ చూసిన యుకె ఎంపీ రాజీనామా