Dilip Vengsarkar : భారత మాజీ క్రికెటర్, సెలెక్షన్ కమిటీ మాజీ చైర్మెన్ దిలీప్ వెంగ్ (Dilip Vengsarkar) సర్కార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు చెందిన స్టార్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ హవా నడుస్తున్న సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ చుక్కలు చూపించాడు.
మిగతా బ్యాటర్లతో అతడి స్పీడ్ కు బెంబేలెత్తి పోతుంటే గైక్వాడ్ మాత్రం షాక్ ఇచ్చాడు. కళ్లు చెదిరేలా షాట్స్ ఆడాడు. ఈ తరుణంలో రుతురాజ్ ఆడిన విధానం అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చాడు వెంగ్ (Dilip Vengsarkar)సర్కార్.
మాలిక్ బంతుల్ని అలవోకగా బౌండరీ లైన్ దాటించాడు గైక్వాడ్. అతడిని టీమిండియాలోకి తీసు కోవాలని సూచించాడు. ఈసారి ఐపీఎల్ లో పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డాడు.
ఎస్ ఆర్ఎస్ కు వ్యతిరేకంగా 57 బంతులు ఎదుర్కొని 99 రన్స్ చేశాడు. కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. అతడి అద్భుతమైన ఆట తీరు వల్ల చెన్నై సూపర్ కింగ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.
గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్న ఉమ్రాన్ మాలిక్ ను ఎదుర్కొన్న తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. స్పీడ్ స్టర్ ఫాస్ట్ డెలివరీలను , షార్ట్ డెలివరీలను రుతురాజ్ గైక్వాడ్ ఆడిన తీరు అద్భుతంగా ఉందన్నాడు వెంగ్ సర్కార్.
అతడిని టెస్టు జట్టులోకి తీసు కోవాలని సూచించాడు. మాలిక్ గతంలో జరిగిన మ్యాచ్ లలో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. కానీ రుతురాజ్ గైక్వాడ్ ను ప్రభావితం చేయలేక పోయాడంటూ దిలీప్ పేర్కొన్నాడు.
Also Read : రింకూ సింగ్ బ్యాటింగ్ సూపర్