PBKS vs GT : వరుస విజయాలతో దుమ్ము రేపుతూ వస్తున్న గుజరాత్ టైటాన్స్ కు ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది పంజాబ్ కింగ్స్(PBKS vs GT ). పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచి ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకున్న గుజరాత్ టైటాన్స్ స్కిప్పర్ హార్దిక్ పాండ్యాను దెబ్బ కొట్టింది.
లీగ్ మ్యాచ్ లో భాగంగా బివై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఏకంగా గుజరాత్ టైటాన్స్ పై 8 వికెట్ల తేడాతో విక్టరీ నమోదు చేసింది. మొదట గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 రన్స్ చేసింది.
సాయి సుదర్శన్ ఒక్కడే రాణించాడు. 50 బంతులు ఆడి 5 ఫోర్లు 1 సిక్సర్ తో 65 రన్స్ చేశాడు. ఇక పంజాబ్ కింగ్స్(PBKS vs GT )తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న కగిసొ రబాడా దెబ్బకు గుజరాత్ బ్యాటర్లు ఠారెత్తి పోయారు.
4 ఓవర్లు వేసి టాప్ ఆర్డర్ ను కూల్చాడు. 4 వికెట్లు తీసుకున్నాడు. పంజాబ్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించినందుకు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
అనంతరం 144 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఇంకా నాలుగు ఓవర్లు ఉండగానే 16 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 145 రన్స్ చేసింది.
గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించింది పంజాబ్. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ దంచి కొట్టాడు. 53 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు ఒక సిక్సర్ తో 62 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు.
లివింగ్ స్టోన్ షాన్ దార్ ఇన్నింగ్స్ తో మెరిశాడు. కేవలం 10 బంతులు మాత్రమే ఆడాడు. 2 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. 30 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు.
Also Read : మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ పెళ్లి వైరల్