CSK vs RCB : ఐపీఎల్ 2022 మెగా టోర్నీలో భాగంగా ఇవాళ 49వ మ్యాచ్ జరగనుంది. పుణె వేదికగా జరిగే ఈ మ్యాచ్ పై అందరి ఫోకస్ ఉంది.
ప్లాఫ్ డుప్లెసిస్ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్(CSK vs RCB) తలపడుతోంది.
ఇరు జట్లు బలంగా ఉన్నాయి. చెన్నై మూడు మ్యాచ్ లలో విజయం సాధించి ఆరు మ్యాచ్ లలో ఓటమి పాలైంది. బెంగళూరు జట్టు ఇప్పటి వరకు 10 మ్యాచ్ లు ఆడింది.
ఐదు మ్యాచ్ లలో విజయం సాధించి మిగతా 5 మ్యాచ్ లలో ఓటమి పాలైంది.
ఇరు జట్ల మధ్య భీకర పోరు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక జట్ల విషయానికి వస్తే
చెన్నై సూపర్ కింగ్స్ నుంచి – ధోనీ కెప్టెన్ కాగా రాబిన్ ఊతప్ప, రవీంద్ర జడేజా, డెవాన్ కాన్వే, క్రిస్ జోర్డాన్ , అంబటి రాయుడు ఉన్నారు.
వీరితో పాటు దీపక్ చాహర్ , డ్వేన్ బ్రావో, ప్రిటోరియస్ , ముకేశ్ చౌదరి, సేనాపతి, ఆసిఫ్ , సాన్ ట్నర్ , భగత్ వర్మ, నారాయణ్ జగదీశన్ ,
హంగేర్కర్ ఆడతారు. ఇక మొయిన్ అలీ, శివం దూబే, ఆడమ్ మిల్నే , హరి నిశాంత్ , మహీశ్ తీక్షణ, సోలంకి, సిమ్రన్ జిత్ సింగ్ , తుషార్ దేశ్ పాండే ఆడతారు.
రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు జట్టుకు(CSK vs RCB) డుప్లెసిస్ కెప్టెన్. ఇక జట్టులో విరాట్ కోహ్లీ, రూథర్ ఫోర్డ్ , లువ్నిత్ సిసోడియా, గ్లెన్ మాక్స్ వెల్
, వానిందు హసరంగా, అనీశ్వర్ గౌతమ్ , సిద్దార్త్ కౌల్ , జోష్ హాజల్ వుడ్ ఆడతారు. దినేశ్ కార్తీక్ , మహిపాల్ లామ్రోర్ , అనుజ్ రావత్ , డేవిడ్ విల్లీ,
ఫిన్ అలెన్ , కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్ , జాసన్ బెహ్రిండోర్స్ , చామ వి మిలింద్ , ప్రభు దేశాయ్, షాబాద్ అహ్మద్ , హర్షల్ పటేల్ , ఆకాశ్ దీప్ ఉన్నారు.
Also Read : చుక్కలు చూపించిన లివింగ్ స్టోన్