RBI Governor : స్టాక్ మార్కెట్ పై రెపో రేటు ఎఫెక్ట్
ప్రకటించిన గవర్నర్ శక్తికాంత దాస్
RBI Governor : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియ ( ఆర్బీఐ) బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెపో రేటు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ నిర్ణయం భారతీయ స్టాక్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది.
గత కొన్ని రోజులుగా జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు కూడా స్టాక్ మార్కెట్ పై పడింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్(RBI Governor) చేసిన కీలక ప్రకటనతో దేశీయ సూచీలు భారీగా నష్టానికి గురయ్యాయి.
ఇదిలా ఉండగా రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు గవర్నర్ అధికారికంగా ప్రకటించారు. దీని వల్ల 4.40 శాతానికి పెరగడం పూర్తి ఎఫెక్ట్ పడింది.
ఇది తక్షణం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు గవర్నర్. సెంట్రల్ బ్యాంక్ కూడా నగదు నిల్వల నిష్పత్తిని 50 బేసిస్ పాయింట్లు పెంచింది.
ఈనెల 2 నుంచి 4వ తేదీల్లో జరిగిన సెంట్రోల్ బోర్డులో మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ ) ఈ నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, అధిక ముడి చమురు ధరలు , ప్రపంచ వ్యాప్తంగా వస్తువుల కొరత , భారత ఆర్థిక వ్యవస్థపై చూపుతుండడం వల్ల ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
దేశీయ సరఫరాలు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా గోధుమల కొరత కారణంగా దేశీయ గోధుమ ధరలపై ప్రభావం చూపుతోందని అందువల్ల ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగానే ఉంటుందని అంచనా వేసినట్లు చెప్పారు గవర్నర్.
ఇదిలా ఉండగా గవర్నర్ ప్రకటన ఒక్కసారిగా తీవ్ర ప్రభావం చూపింది.
Also Read : ట్విట్టర్ సిఇఓపై వేటుకు వేళాయె