BCCI : భారతీయ క్రికెటర్ వృద్ది మాన్ సాహాను భయపెట్టిన అంశానికి సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు సదరు ఆటగాడిని ఇబ్బందికి గురి చేసినందుకు గాను ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ బోరియా మజుందార్ పై 2 సంవత్సరాల పాటు నిషేధం విధించినట్లు బీసీసీఐ వెల్లడించింది.
ఇంటర్వ్యూ ఇవ్వనందుకు తనను ఓ జర్నలిస్ట్ బెదిరించాడంటూ వెటరన్ వికెట్ కీపర్ వృద్ది మాన్ సాహా ఆరోపించాడు. ఈ ఏడాది మార్చిలో దీనిపై విచారణ జరిపిన బీసీసీఐ(BCCI )నియమించిన విచారణ కమిటీకి అతను వివరాలు అందించాడు.
జర్నలిస్ట్ బోరియా మజుందార ట్విట్టర్ వీడియోలో సాహా నిందితుడిగా తనను తాను గుర్తించాడు. గతంలో పేరు చెప్పని జర్నలిస్ట్ పై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ న్యూఢిల్లీలో సాహాను కలిసింది.
తనకు తెలిసినవ్నీ కమిటీకి చెప్పాను. అన్ని వివరాలు వారితో పంచుకున్నానని తెలిపాడు సాహా. ఇప్పుడే ఎక్కువ చెప్పలేను. కమిటీ ముందు హాజరైన అనంతరం మీడియాతో అన్నారు.
ఈ సందర్భంగా భారత దేశంలో జరిగే ఏ క్రికెట్ మ్యాచ్ లలో ( దేశీయ, అంతర్జాతీయ) ప్రెస్ సభ్యునిగా బోరియా మజుందార్ అక్రిడేషన్ పొందకుండా నిషేధించినట్లు బీసీసీఐ ప్రకటించింది.
అంతే కాకుండా దేశంలో నమోదిత ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేయకుండా నిషేధం విధించినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా బోరియా మజుందార్ మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్. ఆయన పుస్తకాలు కూడా రాశారు.
వృద్దిమాన్ సాహా టాంపరింగ్ కు పాల్పడ్డాడంటూ ఆరోపించాడు. కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కానీ బీసీసీఐ(BCCI )మాత్రం సీరియస్ గా తీసుకుంది.
Also Read : సమ ఉజ్జీల పోరులో విజేత ఎవరో