Bhilwara Clashes : రాజస్థాన్ లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. నిన్నటి దాకా జోధ్ పూర్ లో జరిగితే తాజాగా భిల్వారా(Bhilwara Clashes) లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పాలనా యంత్రాంగం ఇంటర్నెట్ ను నిలిపి వేశారు.
ఇదిలా ఉండగా భిల్వారా నగరంలో భోజనం చేస్తుండగా ఇద్దరు వ్యక్తులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. వారికి చెందిన బైక్ ను దుండగులు తగుల బెట్టారు.
గత రాత్రి నగరంలోని సంగనేర్ ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘటనతో రాజస్థాన్ లోని భిల్వారా(Bhilwara Clashes) నగరంలో ఇంటర్నెట్ సేవలను గురువారం నుంచి 24 గంటల పాటు నిలిపి వేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ మోడీ వెల్లడించారు.
ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా తెలిపారు. భోజనం చేస్తుండగా దాడికి పాల్పడినట్లు సమాచారం. వారి బైక్ ను కూడా తగులబెట్టారు. దనిపై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.
అయితే ఇది మత పరమైన ఘటననా లేక వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిందా అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత కొన్ని వారాలుగా రాజస్థాన్ తో సహా భారతదేశం అంతటా అనేక మత ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.
మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్లు, హనుమాన్ చాలీసా వివాదం, కర్ణాటకలో హిజాబ్ వివాదం, ఢిల్లీలో జహంగీర్ పూర్ లో హనుమాన్ జయంతి సందర్భంగా ఘర్షణ లు చోటు చేసుకున్నాయి.
ఇదిలా ఉండగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కోసం కఠిన చర్యలు తీసుకున్నామని సిఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.
Also Read : అక్టోబర్ 2 నుంచి పీకే పాదయాత్ర